పరిమళాలతో ఆరోగ్యం.. అరోమా థెరిపీ


మెదడు, చర్మం, మొత్తంగా శరీరానికే స్వస్థత చేకూర్చే ప్రత్యామ్నాయ వైద్య పద్ధతిగా ‘అరోమా థెరపీ’ ఇటీవలి కాలంలో ప్రాచుర్యం పొందింది. చెట్లు, పూల నుంచి తీసిన సారంతో తయారయ్యే ఈ నూనెలను ఎక్కువగా సౌందర్య పద్ధతులలో వాడుతున్నప్పటికీ డిప్రెషన్‌ తగ్గించేందుకు, ఉత్సాహాన్ని పెంచేందుకు, సంపూర్ణ ఆరోగ్యం కోసం వీటిని ఉపయోగించవ్చనని అరోమా థెరపీ ప్రాక్టిషనర్లు చెప్తున్నారు. ఆరోమా థెరపీ ఎప్పుడు పుట్టింది అనేది నిర్ధిష్టంగా ఎక్కడా నమోదు కానప్పటికీ ఈజిప్షియన్లు మృతి చెందిన వారి శరీరాలకు పూతగా ఉపయోగించేందుకు కొన్ని మొక్కల నుంచి తైలాన్ని తీసి ఉపయోగించారని తెలుస్తోంది. ఇక ఉత్సాహాన్ని పెంచేందుకు అరోమా ఆయిల్స్‌ను చైనాలో ఎక్కువగా ఉపయోగించేవారట.

వైద్య పితామహుడిగా భావించే హిప్పోక్రేట్స్‌ కూడా స్వస్థత కోసం అరోమా థెరపీ ఉపయోగించారుట. అయితే ‘అరోమా థెరపీ’ అనే పదాన్ని తొలిసారిగా ప్రయోగించింది ఫ్రెంచి కెమిస్ట్‌ రినె మారిస్‌ గట్టెఫోసె. లావెండర్‌ నూనె తనకు అయిన కాలిన గాయాన్ని మాన్పడాన్ని గమనించిన ఫ్రెంచ్‌ సర్జెన్‌ జీన్‌ వాల్నెట్‌ రెండవ ప్రపంచ యుద్ధంలో సైనికుల గాయాలకు పూతగా ఈ నూనెలను వాడటం ప్రారంభించాడు. 



వివిధ మొక్కల ఆకులు, బెరడు, పూలు, కాండం, వేర్లు ఇలా ప్రతి ఉపయుక్తమయ్యే ప్రతిభాగం నుంచీ సారాన్ని సేకరించే ఈ తైలాలను ‘ఎస్సెన్షియల్‌ ఆయిల్స్‌’ అంటారు. అన్నింటిలోకీ ప్రాచుర్యం పొందింది లావెండర్‌ ఆయిల్‌. ఇది ఒత్తిడిని తగ్గిస్తుందని రుజువైంది. అలాగే పిప్పరమెంట్‌ సహజ శక్తిని పెంచేదిగా తేలింది. అనేక తైలాలు అందుబాటులో ఉన్నప్పటికీ అవి ఎందుకు ఉపయుక్తమో తెలుసుకునే వాటిని కొనుగోలు చేయడం మంచిది.

బెర్గామాట్‌: 

ఇది నిమ్మ వాసన కలిగిన నూనె. దీనిని సిట్రస్‌ బెరాగమియా చెట్టు నుంచి గ్రహిస్తారు. ఈ చెట్లు ఆగేయ ఆసియాలో ఎక్కువగా కనుపిస్తాయి. దీనిని మసాజ్‌ ఆయిల్‌లో కలుపుకునో లేక స్నానం చేసే నీళ్ళలో కలుపుకునో ఉపయోగించవచ్చు. ఈ నూనెను ఆందోళన, ఒత్తిడి, డిప్రెషన్‌, సొరియాసిస్‌, ఎగ్జిమా వంటి చర్మ వ్యాధులకు, అనెరోగ్జియాకు చికిత్సగా ఉపయోగిస్తారు. అయితే దీనికి చర్మానికి మంటపుట్టించే గుణం ఉన్నందున నేరుగా చర్మానికి రాసుకోకూడదు. అలాగే ఈ నూనె ఉపయోగించేటప్పుడు ఎండలో తిరగరాదు.

మల్లె: 

మల్లెపూల వాసన ఎంత ఘాటుగా, ఎంత రొమాంటిక్‌గా ఉంటుందో అందరికీ తెలిసిన విషయమే. దీని నూనెను డిప్రెషన్‌ను తగ్గించేందుకు, మనస్సును ఉత్తేజితం చేసేందుకు ఉపయోగిస్తారు. ఇది మంచి యాంటీ సెప్టిక్‌, డిస్‌ఇన్ఫెక్టెంట్‌ అని కూడా తేలింది. అయితే గర్భిణీలు దీనిని వాడకపోవడం మంచిది.
సెడార్‌ వుడ్‌: 

ఇది ఉత్తర అమెరికాకు చెందిన వృక్షం. దీనిని కూడా ఒత్తిడి, ఆందోళన తగ్గించేందుకు ఉపయోగిస్తారు. అలాగే శ్వాస సంబంధమైన సమస్యలు, చర్మ సమస్యలను తగ్గించేందుకు ఉపయోగిస్తారు. మూత్రకోశ ఇన్ఫెక్షన్లను కూడా ఇది తగ్గిస్తుంది. దీనిని వేరే మసాజ్‌ ఆయిల్‌లో కలిపి ఉపయోగించాలి. అలాగే గర్భం ధరించిన సమయంలో దీనిని ఉపయోగించరాదు. 


కేమొమైల్‌:
దీనిని మసాజ్‌ ఆయిల్స్‌తో కలిపి తీసుకోవడం లేదా స్వేదన చికిత్సలో ఉపయోగించవచ్చు. ఇందులో లభించే రోమన్‌ రకం కేమొమైల్‌ను మౌత్‌ వాష్‌గా ఉపయోగించవచ్చు. ఇది చాలా ప్రశాంతత కలిగించే గుణాలు కలిగినది. దీనితో పాటుగా యాంటీ బయాటిక్‌, యాంటీసెప్టిక్‌, యాంటీ డిప్రెసెంట్‌గా ఉపయోగించవచ్చు. అలాగే మొటిమలు తగ్గించేందుకు కూడా ఇది ఉపయోగపడుతుంది. దీనిని గర్భం ధరించిన సమయంలో ఉపయోగించరాదు.

యూకలిప్టస్‌:

శ్వాసకు సంబంధించిన వ్యాధులను తగ్గించడంలో, ఏకాగ్రత పెంచడంలో దీనికి సామర్ధ్యం ఉందని తెలుస్తోంది. వీటితో పాటుగా దీనిని యాంటీసెప్టిక్‌గా, నొప్పులకు, ముక్కులు బ్లాక్‌ అయినప్పుడు, మైగ్రైన్లు, జ్వరాలు, కండరాల నొప్పులు, ఇతర నొప్పులకు ఉపయోగించవచ్చు. అయితే పిల్లలకు పాలు ఇచ్చే స్ర్తీలు, మూర్ఛ రోగం ఉన్నవారు దీనిని ఉపయోగించరాదు.

నిమ్మ నూనె: 

చర్మ సమస్యల నుంచి జీర్ణ సంబంధ సమస్యల వరకూ అనేకానికి ఉపశమనం కలిగించగల గుణం నిమ్మ నూనెకు ఉంది. కొవ్వు తగ్గించడంలో, ఇమ్యూనిటీని పెంచడంలో ఇది సహాయపడుతుంది. తలనొప్పులు, జ్వరానికి కూడా దీన్ని ఉపయోగించవచ్చు. దీనిని కూడా వేరే మసాజ్‌ నూనెలలో కలిపి వాడడం మంచిది తప్ప నేరుగా వాడరాదు. అలాగే ఎండలోకి వెళ్ళేటప్పుడు దీనిని ఉపయోగించరాదు.
రోజ్‌: 

మహిళలకు సంబంధించిన అనేక స మస్యలను తగ్గించడంలో ఇది ప్రధాన పాత్ర పోషిస్తుంది. డిప్రెషన్‌, ఒత్తిడి, జీర్ణం కోశ సమస్యలు, గుండెకు, రక్త ప్రసరణకు సంబంధించిన సమస్యలు, శ్వాసకోశ ఇబ్బం దులు వంటి ఎన్నింటి నుంచో ఇది కాపాడుతుంది. అలాగే చర్మానికి ఎంతో మేలు చేస్తుంది. అయితే దీనిని గర్భధారణ సమయంలో ఉపయోగించరాదు. ఇవే కాకుండా మార్జోరాం, పచౌలీ, పెప్పర్‌మింట్‌, రోజ్‌ మేరీ, శాండల్‌ వుడ్‌ తదితర ఎన్నో నూనెలు లభ్యమవుతాయి. 
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top