ఈసారైనా మురిపించేనా?


నృత్య నా నట జీవితంలో అంతులేని బలం ఇవ్వడం వల్ల అదే అంశం ఆధారంగా నిర్మితమైన ఈ షోని అంగీకరించక పోవడం పట్ల తిరిగి ఆలోచించడం.. నేనే వుండాలన్న ‘సోనీ’ రెండేళ్ల ప్రయత్నం నన్ను ఈ
కార్యక్రమం అంగీకరించేలా చేసింది...
                  ఆమె నవ్వు ముందు భగవంతుడేమిచ్చినా బలాదూరే!.. అనే అభిప్రాయాన్ని ఈ మధ్య కెబిసి (కౌన్ బనేగా కరోడ్‌పతి...) లో పాల్గొన్న అభ్యర్థి అభిప్రాయం వెలిబుచ్చాడు. ఇందులో ప్రస్తావించిన ఆమె ‘మాధురీ దీక్షిత్’ అని వేరే చెప్పనక్కర్లేదు. ఎందుకంటే ఇండియన్ స్క్రీన్‌పై చూడగానే ‘ఆహా’ అనిపించే చక్కటి నవ్వు సొంతమైన నటీమణుల సంఖ్య వేళ్ల మీదే ఉంది. అందులో మాధురీ ముందే ఉంటుంది. వివాహానంతరం విదేశాలు వెళ్లడం వల్ల వెండి తెరకు దూరమై, మమకారం పోక మళ్లీ ఓ రెండేళ్ల క్రితం ఒక హిందీ చిత్రంలో సాక్షాత్కరించినా అదేమంత అనుభవాన్ని ఆమెకు మిగల్చలేదు. దాంతో ఎందుకు మళ్లీ తెర ప్రయత్నం అని ఆ ఆలోచనలకు తెర దించేసింది మాధురి. కానీ తిరిగే కాలు.. కుదురుగా కూర్చోనివ్వదు కదా. తన ప్రమేయం లేకుండా తమంత తాము సోనీ టెలివిజన్ సంస్థ మాధురీ దీక్షిత్ వెంట దీక్షగా వెంటపడి తాము రూపొందించిన ‘ఝలక్ దిఖ్‌లాజా’ న్యాయ నిర్ణేతగా ఒప్పించారు.
నేను ముందు ఒప్పుకోలేదు...
‘అవును.. నేనీ కార్యక్రమంలో పాల్గొనడం పట్ల ముందు విముఖత చూపాను. కానీ ‘సోనీ’ నన్ను వదిల్తేనా... నృత్య నా నట జీవితంలో అంతులేని బలం ఇవ్వడం వల్ల అదే అంశం ఆధారంగా నిర్మితమైన ఈ షోని అంగీకరించక పోవడం పట్ల తిరిగి ఆలోచించడం.. నేనే వుండాలన్న ‘సోనీ’ రెండేళ్ల ప్రయత్నం నన్ను ఈ కార్యక్రమం అంగీకరించేలా చేసింది’ అంటారు మాధురీ దీక్షిత్.
               డిసెంబర్ 13 నుంచి వారానికి రెండు రోజులపాటు ప్రసారమవుతున్న ‘ఝలక్...’లో తన పాత్ర గురించి ప్రస్తావిస్తూ మాధురి - ఈ డాన్స్ షోలో పాల్గొన్న వారు చేసిన నృత్యానికి సంబంధించి సాంకేతిక విషయాలపై నేను జడ్జ్ చేయను.
               దీనికి ఆ విభాగంలో నిష్ణాతులైన వ్యక్తులున్నారు. నా పనల్లా పాల్గొన్న వారి రూప లావణ్యాలు, ప్రదర్శించిన నృత్యానికి చెందిన భావ ప్రకటన సౌకర్యవంతంగా చేస్తున్నారా లేదా అన్నవి పరిశీలించటమే. దాంతోపాటు నేనూ నా నృత్య రీతులు ఎలా ఉన్నాయో తెలుసుకోడానికి తిరిగి డాన్స్ చేసే అవకాశం నాకిందులో కలుగుతోంది.. అంటోంది.
                మరి మూడు నెలలపాటు సోనీలో చిందించే మాధురీ చిద్విలాసం ఎంతవరకు సఫలీకృతమవుతుందో చూడాలి. ఏమైనా సినిమాల్లో పొందిన రీ ఎంట్రీ తాలూకు ఫలితాలకు జతగా చిన్న తెర రిజల్ట్స్ చేరకూడదని కోరుకుందాం.
 
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top