బటర్‌స్కాచ్ కేక్


కావలసిన పదార్థాలు :
మైదాపిండి-100గ్రా, వెన్న-100గ్రా, పంచదార పొడి-100గ్రా, కోడిగుడ్లు-రెండు లేదా మూడు, బేకింగ్ పౌడర్-ఒక టీ స్పూన్, వంట సోడా-అర టీ స్పూన్, పాలపొడి-రెండు టేబుల్ స్పూన్లు, బటర్‌స్కాచ్ ఎసెన్స్-ఒక టీ స్పూన్, లెమన్ ఎల్లో ఫుడ్ కలర్-తగినంత.

ఐసింగ్ కోసం : 

వెన్న-100గ్రా, ఐసింగ్ షుగర్-200గ్రా, లెమన్ ఎల్లో కలర్-కొన్ని చుక్కలు, బటర్‌స్కాచ్ కాండీస్-అర కప్పు, వేడినీరు-కొద్దిగా.

తయారుచేసే విధానం : 

ఒక పాత్రలో కొంత మైదాపిండి, బేకింగ్ పౌడర్, వంట సోడా, పాలపొడి, వెన్న, పంచదార వేసి కలపాలి. తరువాత ఈ మిశ్రమాన్ని మిక్సీలో వేసి గిలకొట్టాలి. దీనికి కోడిగుడ్ల సొన, బటర్‌స్కాచ్ ఎసెన్స్, లెమన్ ఎల్లో ఫుడ్ కలర్ చేర్చి మళ్లీ ఒకసారి మిక్సీలో గిలకొట్టాలి. మరీ పలచగా అనిపిస్తే మైదాపిండిని కొద్దికొద్దిగా చేర్చుతూ మళ్లీ మిక్సీలో గిలకొట్టాలి. తరువాత ఎలక్ట్రిక్ ఓవెన్‌లోని గిన్నెలో కొద్దిగా డాల్డా రాసి, ఈ మిశ్రమాన్ని ఆ గిన్నెలో పోసి 180 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత వద్ద 40-50 నిమిషాలు బేక్ చేయాలి. బేకింగ్ పూర్తయి చల్లారాక కేక్‌పైన ఐసింగ్ చేయాలి.

ఐసింగ్ ఇలా : 

వెన్న, ఐసింగ్ షుగర్‌లను ఒక పాత్రలో వేసి నురుగు వచ్చేంత వరకు గిలకొట్టాలి. దీనికి ఎసెన్స్, ఫుడ్ కలర్, కొద్దిగా వేడినీరు చేర్చి మళ్లీ గిలకొట్టాలి. ఈ మిశ్రమాన్ని కేక్‌పైన పల్చగా పోసి బటర్ నైఫ్ సహాయంతో కేక్ అంతటా సమంగా సర్దాలి. ఆపైన బటర్‌స్కాచ్ క్యాండీస్‌తో అలంకరించాలి.
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top