తేనె పాకం గారెలు


కావలసిన పదార్థాలు
మినపప్పు - అర కేజీ

నూనె - పావు కేజీ
ఉల్లిపాయలు(తరిగినవి)- ఒక కప్పు
పచ్చి మిర్చి(తరిగినవి)- రెండు స్పూన్‌లు
అల్లం ముక్కలు(సన్నగా తరిగినవి)-రెండు స్పూన్‌లు
జీలకర్ర - ఒక స్పూన్
కొత్తిమీర తురుము- ఒక కప్పు
ఉప్పు - తగినంత
పంచదార - పావు కేజీ.
తయారుచేయు విధానం

ముందుగా ఒక పాత్రలో తగినన్ని నీళ్లు తీసుకుని పంచదార వేసి మరిగించి తేనె పాకం తయారుచేసుకోవాలి. తరువాత మినపప్పుని కడిగి గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. మిశ్రమం బాగా మెత్తగా కాకుండా కొంచెం గట్టిగా ఉండేలా చూసుకోవాలి. తరువాత అందులో ఉల్లిపాయలు, అల్లం, పచ్చి మిర్చి, జీలకర్ర, కొత్తిమీర, ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఒక పాత్రలో నూనె వేసి వేడి అయ్యాక చేతిపై గారెల మాదిరిగా వత్తుకుంటూ నూనెలో వేసుకోవాలి. తరువాత ఆ గారెలను పంచదార పాకంలో వేయాలి. అంతే... తేనె పాకం గారెలు రెడీ.
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top