తొలిదశలో...కీళ్లనొప్పి మందులతో తగ్గుతుందా?

మన ప్రతి కదలికకూ కీళ్లే కీలకం. కీళ్లలో ఏ సమస్య వచ్చినా మనలో కదలికలు పరిమితమైపోతాయి. కీళ్లు పట్టివేయడం నుంచి, చిన్నపాటి దెబ్బలు, రుమటాయిడ్ ఆర్థరైటిస్, టోన్ క్యాన్సర్, ల్యుకేమియాలో వచ్చే నొప్పుల వరకు సుమారు 140 రకాల కీళ్ల సమస్యలు వస్తుంటాయి. వీటికి కారణాలు దాదాపుగా ఏడు వందలకు పైగా ఉంటాయి.

                కీళ్లనొప్పులను నిర్లక్ష్యం చేస్తే తీవ్రమై కీళ్లు రూపాన్ని కోల్పోవడంతోపాటు నిర్మాణంలో తేడా వస్తుంది. కీళ్లలో అరుగుదల ఎక్కువై క్రమంగా కదలిక తగ్గుతుంది. కండరాల్లో పటుత్వం తగ్గుతుంది. కూర్చు ని - లేవడం, మెట్లు ఎక్కడం- దిగడం వంటి కొన్ని పనులను చేయలేం. మన సాధారణ టాయిలెట్లను ఉపయోగించడమూ కష్టమవుతుంది.


            ఎముక కణాలు 40 రోజులకు ఒకసారి చనిపోయి ఆ స్థానంలో కొత్తవి పుడుతుంటాయి. ఆస్టియో ఆర్థరైటిస్ సమస్య ఉంటే ఈ కణాలు ఎముక అరిగిన దగ్గర కాకుండా వేరే చోట ఏర్పడతాయి. 



కీళ్లనొప్పులు - నిర్ధారణ
కీళ్లనొప్పులను నిర్ధారించడానికి కొన్ని రకాల రక్తపరీక్షలు, మూత్ర పరీక్ష, ఎంఆర్‌ఐ, సిటిస్కాన్, సైనోయిడ్ ఫ్లూయిడ్ కల్చర్ వంటివి చేయాల్సి ఉంటుంది. ఈ పరీక్షల ద్వారా కీళ్లనొప్పులకు కారణం ఎముకల్లో లోపమా లేక రక్తంలో తేడానా అన్నది నిర్ధారించవచ్చు.
చికిత్స
చాలా సందర్భాల్లో కీళ్లనొప్పులు ముఖ్యంగా ఆస్టియోఆర్థరైటిస్ వంటివి తగ్గాలంటే కీళ్లమార్పిడి శస్తచ్రికిత్స మాత్రమే మార్గమని ఆందోళన పడుతుంటారు. ఆపరేషన్ అవసరం లేకుండా మందులతో తగ్గించడం ఆధునిక హోమియో వైద్యవిధానంలో సాధ్యమవుతోంది. హోమియో మందులు ఇన్‌ఫెక్షన్ వంటి శరీరంలో నిల్వ ఉన్న టాక్సిన్లను బయటకు పంపించడం ద్వారా వాపును తగ్గిస్తాయి. దెబ్బతిన్న భాగానికి రక్తసరఫరా సరిగా జరిగేటట్లు చేసి గాయం త్వరగా మానడానికి సహకరిస్తాయి. కండరాలను బలోపేతం చేసి నొప్పి, వాపులను తగ్గిస్తాయి. సమస్యను నిర్లక్ష్యం చేసి, పరిస్థితి తీవ్రమైన తర్వాత మాత్రం ఆపరేషన్ ఒక్కటే మార్గం.

              కీళ్ల సమస్యలకు వైద్యుని పర్యవేక్షణలో బైపోనియా, రస్టాక్స్, లెటమ్‌పాల్, గయకం, గవర్తిరియ, బెలడోనియం, కాల్కేరియాఫాస్, కాల్కేరియా ప్లోర్ వంటి మందులను వాడితే బాధ నుంచి పూర్తిగా ఉపశమనం పొందవచ్చు.

block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top