ఇంట్లోఉన్న వస్తువులతో ఫేస్ ప్యాక్, మాయిశ్చరైజర్‌ తయారీ విధానం


అందానికి ప్రతీకలు అమ్మాయిలు. అందాన్ని కాపాడుకోవడానికి ఈతరం అమ్మాయిలు పడే కష్టాలు అన్నీ ఇన్నీ కాదు. క్లీనింగ్‌లు, బ్లీచింగ్‌లు, ఫేస్ ప్యాక్‌లంటూ బ్యూటీపార్లర్‌లకు అంకితం అవుతున్నారు. పార్లర్లను పెంచి పోషించాల్సిన అవసరం లేకుండానే ఇంట్లో ఉన్న వస్తువులతో ఫేస్ ప్యాక్‌లను, మాయిశ్చరైజర్‌లను తయారు చేసుకోవచ్చు. ఇవి తయారు చేసుకోవాలంటే కేవలం మీకు కావలసింది కాసింత ఓపిక, తీరిక... మరి అవి ఎలా తయారుచేసుకోవాలో తెలుసుకుందాం రండి.
  •   పచ్చి పాలల్లో దూదిని ముంచి దానితో ముఖాన్ని తుడవండి. ఇలా చేయడం వల్ల చర్మం మీద ఉండే దుమ్ము తొలగిపోతుంది.
  •   బాదం(ఆల్‌మండ్)ఆయిల్‌తో తుడవడం వల్ల కళ్ల కింద ఉండే నలుపు చారలు తగ్గిపోతాయి.
  • చర్మం తేమగా ఉండాలంటే ఒక కప్పు పెరుగులో టేబుల్ స్పూన్ నారింజరసం, ఒక టేబుల్ స్పూన్ నిమ్మరసం కలిపి ముఖానికి పట్టించి 15నిమిషాల తర్వాత కడిగేయండి. తేడా మీకే తెలుస్తుంది.
  •  ఒకవేళ మీది పొడి చర్మం అయితే ఓట్‌మీల్‌లో కాస్త తేనె కలిపి రాసి 15నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో కడిగేయండి.
  •   చర్మ సంరక్షణ కొరకు ఒక టేబుల్ స్పూన్ ఎర్రపప్పు, నాలుగు బాదంపప్పులను రాత్రి నానబెట్టి, ఉదయాన్నే దాన్ని రుబ్బి ముఖానికి పెట్టుకోవాలి. ఓ అరగంట తర్వాత గోరువెచ్చని నీటితో కడిగేయాలి. ఇలా చేయడం వల్ల చర్మ సర రక్షణ తో పాటు, బ్లీచింగ్ కూడా చేసినట్లే.
  • ఒక టేబుల్ స్పూన్ తేనెలో, రెండు టేబుల్‌స్పూన్‌ల పాలపొడిని కలిపి ముఖానికి పెట్టి కాసేపటి తర్వాత కడిగేయండి. ఇలా రోజూ చేస్తూ ఉంటే మీ ముఖం మెరుపులో తేడా మీకే తెలుస్తుంది.
  •  రోజు బంగాళాదుంపతో కూడా ముఖాన్ని తుడిస్తే చర్మం నిగారింపు వస్తుంది.
  • దోసకాయరసంలో కొద్దిగా గ్లిజరిన్, రోజ్‌వాటర్ కలిపి ముఖానికి పెట్టుకుంటే ఎండాకాలం కూడా చల్లగా ఉంటుంది.
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top