స్ప్రే చేస్తే సిగ్గు మాయం...


కొందరికి నలుగురిలోకి రావాలంటే సిగ్గు, మాట్లాడాలంటే సిగ్గు. ఇలాంటి వారు మొహమాటంతో ఎదుటివారిని చంపేస్తారు. ఈ మొహమాటానికి మందే లేదా? అని వాపోతుంటారు చూసేవాళ్లు. ఈ విషయాన్ని గ్రహించే సిగ్గు, మొహమాటాలు పోగొట్టడానికి మందులు కనిపెట్టారు అమెరికాకి చెందిన పరిశోధకులు. రేపో మాపో మీ సిగ్గుని పోగొట్టే ఓ స్ప్రే మార్కెట్లోకి రాబోతోంది.

లవ్ హార్మోన్ 'ఆక్సిటోసిన్'ను ఉపయోగించి న్యూయార్క్‌లోని మౌంట్ సినాయ్ విశ్వవిద్యాలయం పరిశోధకులు దీన్ని తయారుచేశారు. మొదట 27 మందిపై ఈ స్ప్రేని ప్రయోగించారు. వారి నుంచి ఆశించిన ఫలితాలు వచ్చాయి. ఈ స్ప్రేని వాడాక కొత్త వాళ్లతో కలవడానికి సిగ్గు పడేవాళ్లలో, నలుగురితో మాట్లాడడానికి ఇబ్బందిపడే వాళ్లలో మంచి మార్పు వచ్చిందట. స్ప్రే వాడిన తర్వాత వీరు చాలా చురుగ్గా కనిపించారట.

మందు వాడటానికి ముందుతో పోల్చితే వాళ్ల ఆలోచనల్లో కూడా మార్పు వచ్చిందట. ఈ పరిశోధనకు నాయకత్వం వహించిన జెన్నిఫర్ బార్డ్ మాట్లాడుతూ "ఈ స్ప్రే పూర్తిస్థాయిలో విజయవంతమైతే ఆటిజం లాంటి మానసిక జబ్బులున్న పిల్లల్లో కలివిడితనం పెరిగే అవకాశం ఉంది'' అన్నారు.
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top