కట్టిపడేసే నయనాల(కళ్లు) కోసం.....పలు జాగ్రత్తలు


సర్వేంద్రియానాం నయనం ప్రధానం అన్న నానుడి మనందరికీ తెలిసిందే. మన ప్రతి కదలికకూ కంటిచూపే ఆధారం. అంతేకాదు ముఖసౌందర్యంలో కళ్లకు ఎంతో ప్రా«ధాన్యం ఉంది. ఆరోగ్యవంతమైన కళ్లు చూసేవారిని కట్టిపడేస్తాయి. అంతటి ప్రాధాన్యం ఉన్న కళ్ల విషయంలో మనం పలు జాగ్రత్తలు పాటించడం తప్పనిసరి.

చీ కళ్లకు విశ్రాంతి చాలా ముఖ్యం. ఏ పనిచేస్తున్నాసరే మధ్యమధ్యలో అంటే ప్రతి పదినిమిషాలకోసారి కళ్లను ఓ నిమిషంపాటు మూసుకుని ఉంచాలి. అలసిన కళ్లకు విశ్రాంతినివ్వాలంటే గుండ్రంగా తరిగిన దోసకాయ ముక్కలను కళ్లపై పెట్టుకొని కొంతసేపు విశ్రాంతి తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల కళ్లకింది నల్లటి వలయాలు కూడా తగ్గిపోతాయి. పొట్లకాయ ముక్కలను కూడా కళ్లపై ఉంచుకోవచ్చు.


- కళ్లకు అలసట పోవడం కోసం మధ్య మధ్యలో చల్లటి నీళ్లను కళ్లపై చిమ్ముకోవడం ఓ చక్కటి ఉపాయం. కళ్లల్లోకి నీళ్లు వేగంగా కాకుండా నెమ్మదిగా చిమ్ముకోవాలి. వేగంగా చిమ్ముకోవడం వల్ల కళ్లలో ఉండే ధూళి కణాలు కార్నియాకు హాని కలిగిస్తాయి.

-కంప్యూటర్ల ముందు కూర్చుని పనిచేసేవారు క్రమం తప్పకుండా కళ్లను రెప్పలాడిస్తూ ఉండాలి. అలా చేయకపోతే కళ్లు పొడిబారిపోయి కంటిచూపుపై ప్రభావం పడుతుంది.

- కళ్లపై మరీ ఎక్కువ లైటింగ్ పడకుండా చూసుకోవాలి. అలాగే చదువుతున్నప్పుడు సరిపడా కాంతి ఉండేలా జాగ్రత్తపడాలి. లేకుంటే కళ్లు అధిక శ్రమ, ఒత్తిడికి లోనై చూపు మందగిస్తుంది.

- కళ్లకు సరైన విశ్రాంతి లేకపోయినా, ఎక్కువ అలసట, ఒత్తిడికి లోనైనా కళ్లకింద నల్లటి వలయాలు ఏర్పడతాయి. ఇటువంటి పరిస్థితుల్లో మూడు బాదం గింజలను పాలతో కలిపి పేస్ట్‌లా చేసి కంటికింది భాగంలో రాసుకుని కొంచెంసేపు ఆరనిచ్చి కడిగేసుకోవాలి. ఇలా కళ్లకింద ఏ క్రీమునైనా ఉంగరం వేలుతో రాసుకోవడం మంచిది.

- కళ్లు దురదపెట్టినా, మంటపెట్టినా ఎట్టిపరిస్థితుల్లోనూ నలపకూడదు. దానివల్ల కళ్లల్లోని సున్నితత్వం దెబ్బతింటుంది. చేతులకున్న బ్యాక్టీరియా కళ్లలోకి చేరి ఇన్ఫెక్షన్ వచ్చే ప్రమాదం ఉంటుంది.
 

టీవీని కనీసం పది అడుగుల దూరం నుంచి చూడడం క్షేమకరం. చదివే పుస్తకాన్ని కళ్లకు రెండు అడుగుల దూరం పెట్టుకోవడం మంచిది.

- ఐ మేకప్ కోసం పౌడర్ కంటే క్రీము వాడుకోవడం మంచిది. పౌడర్ అయితే కంట్లోకి పోయే ప్రమాదం ఉంటుంది.

- విటమిన్-ఎ ఎక్కువగా ఉన్న ఆహారాన్ని తీసుకోవడం కళ్లకు ఆరోగ్యకరం. బొప్పాయి, గుడ్లు, చేపలు, పాలు, క్యారట్, కొత్తిమీరలో విటమిన్-ఎ ఎక్కువగా లభిస్తుంది.

- ఒక ఉసిరికాయను రాత్రంతా నీళ్లలో నానవేసి ఉదయం లేచిన తర్వాత ఆ నీటితో కళ్లను కడుక్కుంటే చాలా మంచిది.

- గోరువెచ్చటి పాలలో దూదిని ముంచి రెండు కళ్లపై పెట్టుకుని పదిహేను నిమిషాలపాటు ఉంచుకోవాలి.

- అలసిన కళ్లకు విశ్రాంతికోసం చల్లటి పాలలో దూదిని ముంచి రెండు కళ్లపై పదినిమిషాలపాటు ఉంచుకుంటే మంచిది.
 

రాత్రి నిద్రించడానికి ముందు ముఖాన్ని శుభ్రంగా కడుక్కోవాలి. ఎటువంటి క్రీము రాసుకోకపోవడమే మేలు.

- కళ్లు అలసటకు లోనైనప్పుడు విశ్రాంతి కోసం కనుగుడ్లను కుడి నుంచి ఎడమకి, ఎడమ నుంచి కుడికి అలా తిప్పుతూ ఉండమని యోగా నిపుణుల సూచన.

- కళ్లకు, కళ్లచుట్టూ ఉండే కండరాలకు తగినంత విశ్రాంతి కోసం కళ్లు మూసుకుని ప్రశాంతమైన మనస్సుతో నచ్చిన విషయాలను గుర్తుచేసుకోవాలి. తర్వాత నెమ్మదిగా కళ్లు తెరచి దూరంగా చూడాలి ఇలా నాలుగైదు సార్లు చేస్తే కళ్లకు ఎంతో ఆరోగ్యం.

- చేతిలో ఓ పెన్సిల్‌ను పట్టుకుని దాన్ని నెమ్మదిగా ముక్కు దగ్గరకు తీసుకురావాలి. ఆ సమయంలో కంటిచూపును పెన్సిల్‌మీద కేంద్రీకరించాలి. ఇలా పలుమార్లు చేయడంవల్ల కళ్లకు మంచి వ్యాయామం అవుతుంది. దీనివల్ల కంటిచూపు మసకబారకుండా నివారించుకోవచ్చు.

- క్రమం తప్పకుండా తలనొప్పి వస్తుంటే డాక్టర్‌ను సంప్రదించడం మంచిది. తలనొప్పి రావడానికి ఒత్తిడి, కంటి చూపులో తేడాలు. మైగ్రేయిన్, నరాల సంబంధిత సమస్యలు ఇలా ఎన్నో కారణాలు దోహదం చేస్తాయి.

- కళ్లు పొడిబారుతున్నా డాక్టర్‌ను సంప్రదించాలి. దీనికి పలు ఆరోగ్య సమస్యల నివారణ కోసం వేసుకునే మందులు కారణమవుతాయి.
 

కంటికి సంబంధించి ఏ సమస్య లేకపోయినా ప్రతి ఆరునెలలకోసారి కంటిడాక్టర్‌ను తప్పనిసరిగా సంప్రదించాలి. 
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top