స్వచ్ఛమైన అమృతం.. తేనె - ఉపయోగాలు


తేనె అమృతంతో సమానం. ఇది ప్రకృతి ప్రసాదిత దివ్యౌషధం. దీనిలో ఔషధ గుణాలు సమృద్ధిగా ఉన్నాయి. మనదేహాన్ని, జీవక్రియలను క్రమపద్ధతిలో నడిపించగల శక్తి దీనికుంది. అందుకే ప్రతి ఇంట్లోనూ దీనికి చోటివ్వాల్సిందే...
రెండువేల సంవత్సరాల క్రితం గ్రీక్ అథ్లెట్లు శిక్షణా కాలంలో వచ్చే శారీరక బాధలను తట్టుకోవడానికి తేనెను వాడేవారు. దాంతో వారికి శారీరక బాధలు తొలగిపోవడమే కాకుండా శరీరం ఎప్పటికప్పుడు శక్తిమంతం అయ్యేది.
  • తేనెలో గ్లూకోజ్‌తోపాటు ఫ్రక్టోజ్ కూడా ఉంటుంది. ఫ్రక్టోజ్ కాలేయంలో గ్లైకోజన్ ఉత్పత్తిని పెంపొందించడానికి తోడ్పడుతుంది. దీనివల్ల రక్తంలో షుగర్ నియంత్రణలో ఉంటుంది.
  •   తేనెలో కేలరీలు అధికంగా ఉంటాయి. తీసుకున్న వెంటనే కేలరీలు శరీరానికి అందుతాయి.
  •   పడుకునే ముందు ఒక చెంచాడు తేనెను తాగడం వల్ల మెదడు పనితీరు మెరుగుపడుతుంది. కేలరీలను కాలేయంలో నిల్వచేయగల శక్తి ఫ్రక్టోజ్‌కు ఉంది. దీనివల్ల మనం నిద్రపోతున్నప్పుడు మెదడు పనితీరుకు కావాల్సిన కేలరీలు సక్రమంగా అందుతాయి. దాంతో ఉదయం లేచిన వెంటనే అలసినట్లుగా అనిపించదు. అంతేకాదు ప్రశాంత మైన నిద్ర పట్టడానికి కూడా తేనె సహకరిస్తుంది.
  •  తేనెను ప్రతిరోజూ తీసుకోవడం వల్ల నోటిలో పొక్కులు, సిఫిలిస్ వ్యాధి తగ్గిపోతుందని వైద్యపితామహుడు హిపొక్రాట్ అప్పట్లోనే చెప్పాడు.
  •   తేనె వ్యాధినిరోధకశక్తిని పెంపొందిస్తుంది. దీంతో వ్యాధులపై పోరాడే శక్తి శరీరంలోని కణాలకు లభిస్తుంది.
  •   సిడ్నీ యూనివర్సిటీకి చెందిన డాక్టర్ షోన్‌బ్లెయిర్ 2007లో నిర్వహించిన అధ్యయనం ప్రకారం గాయాలకు తేనెతో డ్రస్సింగ్ చేస్తే త్వరగా మానతాయని తేలింది.
  • జలుబు, దగ్గు, సోరియాసిస్, ఎగ్జిమా, కాళ్లమంటలకు కూడా ఇది మంచి ఔషధంగా పనిచేస్తుంది.
  •   ఇది సుఖ విరేచనకారి. అరుగుదల లోపం, వయసు కారణంగా వచ్చే మలబద్ధకాన్ని తగ్గించి విరేచనం సాఫీగా అయ్యేలా చేస్తుంది.
  •   శరీరంలో ఉన్న అధిక నీటిని బయటకు పంపే గుణం సైతం తేనెకుంది. దీనివల్ల శరీరం తేలిక పడుతుంది.
  •   ప్రతి ఉదయం దాల్చిన చెక్కపొడిని తేనెతో కలిపి తీసుకోవడం వల్ల మోకాళ్లు, కండరాల నొప్పులు ఉపశమిస్తాయి. 
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top