ఏరోబిక్ ఎక్సర్‌సైజ్ అంటే ఏమిటి?- ప్రయోజనాలు

ఏరోబిక్ ఎక్సర్‌సైజ్ చేయడం ద్వారా ఊపిరితిత్తులు పర్యావరణం నుంచి ఆక్సిజన్‌ను ఎక్కువ మోతాదులో తీసుకుంటాయి. గుండె, రక్తనాళాలు ఆ ఆక్సిజన్‌ను, ఇతర పోషకాలను ప్రతి కణానికి చేరవేస్తాయి. కండరాలు పనిచేయడానికి, కేలరీలను కరిగించడానికి ఇవి అవసరం. ఈ ఏరోబిక్ ఎక్సర్‌సైజులను చాలా రకాలుగా చేయవచ్చు. వాకింగ్, జాగింగ్, స్లో రన్నింగ్, సైక్లింగ్, స్విమ్మింగ్, తేలికపాటి ఆటలు, డ్యాన్స్ వంటివి మంచి ఫలితాలనిస్తాయి.

ప్రయోజనాలు :

            ఏరోబిక్ ఎక్సర్‌సైజ్ ద్వారా కలిగే ప్రధానమైన ప్రయోజనం... శరీరంలో కొవ్వు కరగడం. వీటి ద్వారా గుండెతోపాటు ఊపిరితిత్తులు, ఇతర శరీర అవయవాల పనితీరు కూడా మెరుగవుతుంది. దీర్ఘకాలం పాటు ఏరోబిక్స్ వ్యాయామం చేయడం ద్వారా శరీరంలో మంచి కొలెస్ట్రాల్ స్థాయులు పెరిగి, ఎల్‌డిఎల్, ట్రైగ్లిజరైడ్స్, హెచ్‌డిఎల్ స్థాయులు తగ్గుతాయి. ఎముకల్లో సాంద్రత, పటుత్వం పెరుగుతుంది. కీళ్ల కదలికలు మెరుగవుతాయి. 
  •  గుండె సంబంధిత వ్యాధులు, డయాబెటిస్, ఆర్థరైటిస్, క్యాన్సర్ వంటి వ్యాధులు వచ్చే అవకాశం గణనీయంగా తగ్గుతుంది. ఒత్తిడిని అధిగమించగల సామర్థ్యం, శరీరంలో వ్యాధి నిరోధక శక్తి పెరుగుతాయి.
  • ఏరోబిక్ వ్యాయామం మొదలు పెట్టే ముందు అప్పటి వరకు చేస్తున్న వ్యాయామాన్ని, ఆరోగ్యస్థితిని, బరువును దృష్టిలో పెట్టుకుని తగిన జాగ్రత్తలు పాటించాలి.
  •  ఏరోబిక్ వ్యాయామం ద్వారా లభించే ప్రయోజనాలను పొందాలంటే కనీసం 12 వారాల పాటు క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి.
  • మొదట మూడు నుంచి నాలుగు వారాల పాటు రోజూ చేయాలి. ఆ తర్వాత వారానికి కనీసం నాలుగైదు సార్లు వ్యాయామం ఉండేటట్లు ప్లాన్ చేసుకోవాలి.
  • ప్రారంభదశలో శరీరం ఎక్కువగా అలసటకు లోనయ్యేటట్లు విపరీతంగా వ్యాయామం చేయకూడదు. పది నుంచి పదిహేను నిమిషాల సేపు వ్యాయామం చేసిన తర్వాత విశ్రాంతి తీసుకోవాలి.
  • మూడవ వారం నుంచి తీవ్రత పెంచవచ్చు. ఏరోబిక్ వ్యాయామాన్ని రోజుకు ముప్పావు గంట నుంచి ఒక గంట సేపటి వరకు చేయవచ్చు.
  • వ్యాయామానికి ఉదయమే మంచి వేళ.
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top