వ్యాయమం అంటే.. బరువు తగ్గేందుకు కాదు...

ఆరోగ్యం విషయంలో మగవారికంటే కూడా మహిళలే ఎక్కువ శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే... ఊబకాయం, ఫిట్‌నెస్‌ వంటి సమస్యలు మగవారికంటే అమ్మాయిల్లోనే ఎక్కువగా వస్తుంటాయి. గృహిణుల్లో ఇలాంటి సమస్యలు మరీ ఎక్కువనే చెప్పవచ్చు. అయితే ఫిట్‌నెస్‌కు మహిళలు అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నప్పటికీ... ఆధునిక ఎక్సర్‌సైజులు, ఏరోబిక్స్‌ చేయడంలో ఉద్యోగిణుల కంటే... గృహిణులు వెనకబడి ఉన్నారు. మామూలుగా చేసే వ్యాయామంతో పాటు ఆరోగ్యవంతంగా జీవించడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే విషయంపై మహిళలు శ్రద్ధ తీసుకోవాలి అని ఫిట్‌నెస్‌ ట్రైనర్‌ అంజు గే అంటున్నారు. అందుకు కొన్ని సూచనలు చేస్తున్నారు. వ్యాయామం కేవలం బరువు తగ్గేందుకు మాత్రమే కాదని ఆమె అంటున్నారు. 

సులువుగా బరువు తగ్గేందుకు...
ఇందుకు సూర్య నమస్కారాలు చాలా చక్కని వ్యాయామం. సూ ర్య నమస్కారాల ద్వారా అనుకున్న సమయంలో అనుకున్నంత బరువు తగ్గవచ్చని అంటున్నారు. పొట్ట చుట్టూ కొవ్వు పేరు కుపోయన వారికి అబ్డామినల్‌ ఎక్సర్‌ సైైజులు బాగా ఉపక రిస్తాయి. నిటారుగా నిల్చుని, మోకాళ్లు ఏ మాత్రం వంగకూడదు ఈ విధంగా ప్రతిరోజూ కనీసం పావుగంట అయినా చేసినట ్లయితే పొట్ట చుట్టూ పేరుకుపోయిన కొవ్వును నెమ్మదిగా కరిగించ వచ్చు.

నాట్యం క్యాలరీలను కరిగిస్తుది. ఇంట్లోనే టేప్‌ నికార్డర్‌ లేదా, డివిడిలు పెట్టుకుని ప్రతిరోజూ కనీసం 20 నిమిషాలు డ్యాన్స్‌ చేసినట్లయితే తక్కువ సమయంలో ఎక్కువ ఫలితాన్ని పొంద వచ్చు. అదే విధంగా ప్రతి రోజూ కొంత సేపు సైకిల్‌ తొక్కడం ద్వారా కూడా అధిక బరువును అదుపులో ఉంచుకోవచ్చని వారు అంటున్నారు.

ఎప్పుడు చేయాలంటే...
నడక చాలా మంచిదని అందరికీ తెలిసిన విషయమే. అయినా భోజనం చేసిన వెంటనే బ్రిస్క్‌ వాక్‌ చేయకూడదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. భోజ నం చేసిన వెంటనే బ్రిస్క్‌ వాకింగ్‌ చేయడం వలన గుండె మీద తీవ్ర ప్రభావం చూపుతుంది. బ్రిస్క్‌ వాకింగ్‌ చేసేవారు భోజనానికి కనీసం అరగంట ముందే దాన్ని పూర్తి చేయాలని వారు సూచిస్తున్నారు.
మంచి ఛాయిస్‌...
బరువు తగ్గాలనుకునే వారికే కాదు ఆరోగ్యానికి కూడా కూరగాయలు మంచి ఛాయిస్‌. మాంసా హారం జోలికి పోకుండా కూరగాయలు తీసుకుంటే తక్కువ సమయంలో ఎక్కువ లాభాన్ని పొందవచ్చు. నీరు తాగడం మంచిదే అయినా భోజనానినికి ముందు లేదా, తరువాత మాత్రమే తాగాలి. రోజుకి కనీసం ఎనిమిది గ్లాసుల నీరు తాగడం తప్పనిసరి.

షుగర్‌ పేషెంట్లు మాత్రం వ్యాయామం చేసే సమయాన్ని ఎప్పుడు చేయాలి? అన్న విషయాలను నిపుణులను అడిగి వ ఆరి సలహా ప్రకారం చేయాలి.
వయసు పైబడినవారు..
40 సంవత్సరాలు దాటిన మహిళలు వ్యాయామం జోలికి పోకుండా యోగా ప్రాక్టీస్‌ చేస్తే మంచి ఫలి తాన్ని పొందవచ్చు. మధ్యాహ్నం, రాత్రి భోజనం అయిన తరువాత గ్లాసు గోరువెచ్చని నీటిని తాగిన ట్లయితే శరీరంలో పేరుకుపోయిన కొవ్వును క్రమేపీ కరిగించుకోవచ్చు.
చిట్కాలు...
రువు తగ్గాలనుకునేవారు ఉలవలను పప్పు లేదా చారు రూపంలో వారంలో కనీసం రెండు సార్లు తీసు కుంటే మంచి ఫలితాన్ని పొందవచ్చు. తక్కువ సమయంలో సన్నగా, నాజూకుగా తయారు కావాలనుకునే వారు బ్లాక్‌ కాఫీ తాగితే మంచిదని నిపుణులు అంటున్నారు.

block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top