భోజన ప్రియుల కోసం ఒక ఛానెల్‌


పురుషులు వంట చేయడమంటేనే వింతగా చూసే కాలంలోనే చెఫ్‌గా తన కెరీర్‌కు శ్రీకారం చుట్టిన సెలెబ్రిటీ చెఫ్‌ సంజీవ్‌ కపూర్‌ అతి త్వరలోనే 24గీ7 ఫుడ్‌ ఛానెల్‌ను ప్రారంభించనున్నారు. హిందీలో ప్రారంభిస్తున్న ఈ ఛానెల్‌ పేరు ‘ఫుడ్‌ ఫుడ్‌’. మలేషియా ఇంటిగ్రేటెడ్‌ క్రాస్‌ మీడియా గ్రూపైన ఆస్ట్రో ఆల్‌ ఏషియన్‌ నెట్‌వర్క్స్‌ సహకారంతో దీనిని ప్రారంభిస్తున్నారు. ఇం దులో కపూర్‌, ఆయన భార్య ఆలియోనాకు చెందిన టర్మరిక్‌ విజన్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ కూడా భాగస్వామిగా ఉంటుంది. ఈ భాగస్వామ్యంతో ఆస్ట్రో తొలిసారిగా భారతీయ మీడియా రంగంలోకి ప్రవేశిస్తున్నది.ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆహారపు అలవాట్లు, పదార్ధాల ఈ ఛానెల్‌ పరిచయం చేయనుంది.ఆహారం కూడా ఒకరకమైన వినోదంగా తయరైందని తమ అధ్యయనాల్లో తేల డం వల్లే ఈ సాహసం చేస్తున్నట్టు వారంటున్నారు. అది రియాలిటీ షో లేదా ట్రావెల్‌ లేక లైఫ్‌ స్టైల్‌కి సంబంధించింది అయినా ఆహారం వినోదప్రపంచంలో ముఖ్యపాత్ర పోషిస్తున్నదని వారు అభిప్రాయపడ్డారు .

       దీనితో పాటుగా త్వరితంగా, తేలికగా, సమతులాహారాన్ని తయా రు చేసుకోవడం ఎలా అనేదాన్ని భారతీయ భోజనప్రియులకు పరిచయం చేయనున్నామని, అలాగే ప్రపంచంలోని ఇతర ప్రాం తాలలో వంటకాలను కూడా పరిచయం చేస్తామని కపూర్‌ చెప్పా రు. ఈ ఛానెల్‌ ప్రధానంగా ఆహారానికి సంబంధించిన అంశాలపైనే దృష్టిని కేంద్రీకరించినా జీవనశైలి, వినోదానికి సంబంధిం చిన అంశాలు కూడా ఉంటాయని ఆయన అన్నారు.అంతేకాదు, భారతీయ ప్రేక్షకులు అనుసంధానం కావడానికి అనుగుణంగానే థీమ్స్‌, రెసిపీలు ఉంటాయన్నారు. కాగా, తమ లక్ష్యం నగరాలలోనూ, పట్టణాలలోనూ నివసించే మధ్య తరగతి జనాభాయేనని అస్ట్రోగ్రూప్‌ మీడి సౌత్‌ ఏషియా, ఇండియా ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ రాఘవేంద్ర మాధవ్‌ తెలిపారు.
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top