Dry Skin Masks


పొడిబారిన చర్మానికి...
రెండు టేబుల్ స్పూన్ల ఆపిల్ పేస్ట్‌లో టీ స్పూన్ నిమ్మరసం, కొద్దిగా తేనె కలపాలి. ఈ పేస్ట్‌ని ముఖానికి, మెడకు, చేతులకు పట్టించి 20 నిమిషాల తరవాత కడిగేయాలి. వారంలో ఒకసారి ఈ ప్యాక్ వేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.

టీ స్పూన్ గోరువెచ్చని ఆలివ్ ఆయిల్‌లో కొన్ని చుక్కల నిమ్మరసం కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి, మెడకు పట్టించి 20 నిమిషాల తరవాత కడిగేయాలి.

టీ స్పూన్ పాల మీగడలో మూడు చుక్కల నిమ్మరసం రంగరించాలి. స్నానానికి ముందు ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేయాలి. ఈ ప్యాక్ వల్ల పొడిబారిన చర్మం మృదువవుతుంది.

చలికి చర్మం పొడిబారుతుంటే స్నానం చేసిన వెంటనే ఒంటికి గ్లిజరిన్ రాయాలి. ఇలా చేయడం వల్ల చర్మం మృదువయ్యి, నిగారిస్తుంది.
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top