ఫ్రూట్ సలాడ్


 కావలసిన పదార్దాలు :
ఆపిల్ ముక్కలు - కప్పు
పైనాపిల్ ముక్కలు - కప్పు
కమలా తొనలు - కప్పు
అరటిపండు ముక్కలు - కప్పు
దానిమ్మ గింజలు - కప్పు
మామిడిపండు ముక్కలు - కప్పు
చెర్రీ పండ్లు (చిన్నముక్కలు) - కప్పు
ద్రాక్ష - కప్పు
బొప్పాయ ముక్కలు - కప్పు
జామకాయ (చిన్న ముక్కలు) - కప్పు
మిరియాలపొడి - ఒక టీ స్పూన్
ఉప్పు - తగినంత
నిమ్మరసం - ఒక టీ స్పూన్
తేనె - రెండు టీ స్పూన్లు
తయారి:
పైన చెప్పిన పండ్ల ముక్కలన్నింటినీ గిన్నెలో వేసుకుని అరగంట సేపు ఫ్రిజ్‌లో పెట్టాలి. తినే ముందు ఆ ముక్కలపై మిరియాలపొడి, ఉప్పు, నిమ్మరసం, తేనె వేసి కలిపి సర్వ్ చేయాలి. అన్నిరకాల పండ్లు తినటం వల్ల శరీరానికి కావలసిన విటమిన్లు, పోషకాలు లభిస్తాయి.
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top