ఖర్జూరం - 250 గ్రా
పాలు - మూడు కప్పులు
పంచదార - 250గ్రా
బాదం పలుకులు - 15
జీడిపప్పు - 10
కిస్మిస్లు - మూడు స్పూన్లు
యాలకుల పొడి - ఒక స్పూన్
నెయ్యి - మూడు స్పూన్లు.
తయారుచేయు విధానం
ముందుగా బాదం, జీడిపప్పు, కిస్మిస్లను నెయ్యిలో వేయించి పెట్టుకోవాలి. తరువాత ఖర్జూరాల్లో గింజలను తొలగించి పాలలో వేసి చిన్న మంటపై ఉడికించుకోవాలి. ఖర్జూరాలు మెత్తగా అయ్యాక పంచదార, నెయ్యి జోడించి మూత పెట్టాలి. మిశ్రమం అడుగంటకుండా గరిటతో కలియబెడుతూ ఉండాలి.మిశ్రమం కాస్త చిక్కగా అయ్యాక యాలకుల పొడి వేసుకోవాలి. తరువాత నెయ్యిలో వేయించిన బాదం, జీడిపప్పు, కిస్మిస్లను వేసుకుని దింపుకోవాలి. అంతే...ఖర్జూర స్వీట్ హల్వా రెడీ.