రాజ్మా - గలౌటీ కబాబ్


కావలసినవి: 
రాజ్మా: రెండు కప్పులు
జీడిపప్పు: పావు కప్పు (నానబెట్టి గ్రైండ్ చేయాలి)
ఏలకులపొడి: టీ స్పూన్
జీలకరప్రొడి: టీ స్పూన్
అల్లంవెల్లుల్లి ముద్ద: రెండు టీ స్పూన్లు
 నెయ్యి: టీ స్పూన్
పాలకోవా: కప్పు
మిరియాలపొడి: టీ స్పూన్
దాల్చిన చెక్కపొడి: చిటికెడు
పచ్చిమిర్చి తరుగు: 2 స్పూన్లు
నిమ్మరసం: 2 స్పూన్లు
ఉప్పు: తగినంత
కొత్తిమీర తరుగు: 2 స్పూన్లు
ఉల్లిపాయలు: 2 (గుండ్రంగా తరగాలి)
మెంతిపొడి: చిటికెడు
కుంకుమపువ్వు: చిటికెడు
తయారి:
రాజ్మా గింజలను ఐదు గంటలసేపు నానిబెట్టి ఉడికించి గ్రైండ్ చేయాలి. బాణలిలో నెయ్యి వేడయ్యాక జీలకర్ర, ఏలకులు, మిరియాలు, దాల్చినచెక్కపొడులు, పసుపు, జీడిపప్పు ముద్ద, అల్లంవెల్లుల్లి పేస్టు వేసి బంగారురంగు వచ్చే వరకు వేయించాలి. అందులో పాలకోవా, మెంతిపొడి, కుంకుమపువ్వు, పచ్చిమిర్చి తరుగు వేసి వేయించాలి. రాజ్మా పేస్టులో నిమ్మరసం, కొత్తిమీర, ఉప్పు వేసి కలపాలి. ఈ మిశ్రమాన్ని చిన్న బాల్స్‌లా చేసి మందంగా ఒత్తుకుని పెనం మీద నెయ్యి వేసి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించి తీయాలి. పైన ఉల్లిపాయలతో గార్నిష్ చేసి టొమాటో సాస్‌తో సర్వ్ చేయాలి.

block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top