మీల్ మేకర్‌తో వెజిటబుల్ బిర్యాని


కావలసిన పదార్థాలు:
బాసుమతి బియ్యం - 3 కప్పులు  (అరగంట నీటిలో నానిన) 
మీల్ మేకర్ - 1 కప్పు (వేడి నీటిలో పావుగంట నానబెట్టిన)
 నెయ్యి - 2 టేబుల్ స్పూన్లు
ఉల్లిపాయ తరుగు - 1కప్పు
అల్లం తరుగు - 1 టేబుల్ స్పూను
పచ్చిమిర్చి - 4 (నిలువుగా తరగాలి)
షాజీరా - 1 టీ స్పూను
బిరింజాకు - 4
మిక్స్‌డ్ వెజిటబుల్ తరుగు (బీన్స్, క్యారెట్, గ్రీన్ పీస్, ఆలు) - 1 కప్పు
ఉప్పు - రుచికి తగినంత
పుదీనా తరుగు - 1 కప్పు
 కొబ్బరి పాలు - రెండున్నర కప్పులు
 జీడిపప్పు - 10
యాలకులు - 5
దాల్చినచెక్క - 1 అంగుళం
లవంగాలు - 6
నీరు - నాలుగున్నర కప్పులు.
తయారుచేసే విధానం: 

నెయ్యిలో షాజీరా, బిరింజాకు, జీడిపప్పు, లవంగాలు, దాల్చిన చెక్క, యాలకులు వేగాక పచ్చిమిర్చి, ఉల్లిపాయ, అల్లం తరుగు, పుదీనా, మిక్స్‌డ్ వెజిటబుల్స్ వేగించాలి. మీల్‌మేకర్ వేసి రెండు నిమిషాలయ్యాక కొబ్బరి పాలు పోయాలి. తర్వాత నీరు కలపాలి. మరుగుతున్నప్పుడు బియ్యం, ఉప్పు వేయాలి. నీరంతా తగ్గిపోయాక మూతపెట్టి సన్నని మంటపై మగ్గించాలి. పెరుగు రైతాతో ఈ బిర్యాని చాలా బాగుంటుంది.
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top