ఎగ్ డ్రాప్-గ్రీన్ పీస్ సూప్


కావలసిన పదార్థాలు :
కోడిగుడ్డు(తెల్లసొన మాత్రమే)- ఒకటి, 
 నీళ్లు-నాలుగు కప్పులు
పచ్చి బఠాణీలు(ఉడికించినవి)-పావు కప్పు
వెన్న-ఒక టేబుల్ స్పూను
 మిరియాల పొడి-పావు టీ స్పూన్
కొత్తిమీర-తగినంత
 ఉప్పు-రుచికి సరిపోయేంత
పాల క్రీమ్-ఒక టేబుల్ స్పూన్
వేగించిన బ్రెడ్ ముక్కల పొడి-ఒక కప్పు
కార్న్‌ఫ్లోర్-రెండు టీస్పూన్లు
పాలు-ఒక టేబుల్ స్పూన్
దాల్చిన చెక్క-చిన్న ముక్క
లవంగాలు-కొన్ని
వేగించిన బ్రెడ్ ముక్కలు-పది.


తయారు చేసే విధానం : 
స్టవ్‌పై ఒక గిన్నె ఉంచి అందులో నీళ్లు పోసి మరగనివ్వాలి. మరో బాణలిలో బటర్ వేసి అది కరిగాక పచ్చి బఠాణీలు వేసి వేగించి ఉడుకుతున్న నీళ్లలో వేయాలి. కొంచెం పాలల్లో కార్న్‌ఫ్లోర్ వేసి కలిపి ఆ మిశ్రమాన్ని కూడా ఇందులో కలపాలి. కోడిగుడ్డు తెల్లసొనను బాగా గిలక్కొట్టి మరుగుతున్న సూప్‌లో కొద్ది కొద్దిగా వంపుతుంటే అది చిన్న చిన్న ఉండలుగా తేలుతుంది. సూప్ కొద్దిగా చిక్కబడ్డాక దించి మిరియాల పొడి కలపాలి. బవుల్స్‌లో సూప్ పోసిన తరువాత పైన పాల క్రీమ్, బ్రెడ్ ముక్కలు వేసి వేడిగా ఉన్నప్పుడే సర్వ్ చేయాలి.
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top