‘స రి గ మ ప’ ప్రత్యేక అతిథి హృతిక్ ?!


ఏ సెలబ్రిటీ అయినా ఏదైనా షోలో కనిపిస్తే - తాము నటించిన సినిమా ఆహా ఓహో అన్నంత అద్భుతంగా ఉంటుందంటూ ఊదరగొట్టేసి - ఉన్నపళంగా థియేటర్‌కి వెళ్లి సినిమా చూసేయండన్న ఉచిత సలహా పారేస్తారు. తాజాగా రిలీజైన ‘గుజారిష్’ కథానాయకుడు మాత్రం విభిన్న తరహాలో వీక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు. ‘స రె గ మ ప’లో ప్రత్యేక అతిథిగా విచ్చేసిన హృతిక్ రోషన్ పార్టిసిపెంట్స్‌తోపాటు ఉల్లాసంగా స్టెప్పులు వేస్తూ - అభినందిస్తూ ఆ కార్యక్రమంలో మమేకమై పోవటమే కాదు - ఏకంగా ఒక్కో పార్టిసిపెంట్‌కి లక్ష రూపాయల నగదు బహుమతిగా ఇస్తూ - ఆ రోజు చక్కటి పెర్‌ఫార్మెన్స్ ఇచ్చిన పార్టిసిపెంట్‌కి ‘బైక్’ కూడా ఇవ్వనున్నట్టు తెలిపాడు. ఎంతమంది ఇలా చేస్తారు? అని ప్రశ్నించుకుంటే - ఒక్కరు కూడా ముందుకి రారు అన్న సమాధానం వస్తుంది.
 
                   ఊహ తెలిసీ తెలియని రోజుల్నుంచీ సంగీతం పట్ల కాస్త అవగాహన కలిగిన హృతిక్ రోషన్ -మధ్యమధ్య ఆయా సంగీత రీతులనూ.. ఫలానా గజల్‌ను పాడమని ఆదేశించటం చూస్తూంటే ఇంత సంగీత పరిజ్ఞానం ‘హృతిక్’కి ఎక్కడ్నుంచీ వచ్చిందని సందేహ పడుతున్నార్ట పార్టిసిపెంట్స్. ముఖ్యంగా - కమల్‌ఖాన్.. అభిలాషా చెల్లూమ్ గాన మాధుర్యానికి తన్మయత్వం చెందిన హృతిక్ ‘కమల్’తో మళ్లీమళ్లీ పాడించటం ఈ కార్యక్రమంలో కొసమెరుపు. అంతేకాదు - యారానా’లోని ‘తేరే జైసా యార్ కహా’ పాటని స్వయంగా హృతిక్ పాడటం కూడా. ఆ మాటకొస్తే హృతిక్ గళ మాధుర్యాన్ని అంతా చవి చూసిన వాళ్లే. సంగీత దర్శకుడు విశాల్ దద్లానీ ‘హృతిక్’ని రోజూ ప్రాక్టీస్ చేస్తే గొప్ప గాయకుడివి కావచ్చన్న కితాబు కూడా ఇచ్చాడు మరి.
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top