ఒత్తిడీ మంచిదే !! ఆరోగ్యానికి అక్యుప్రెషర్‌


నొప్పులను, బాధలను తగ్గించేందుకు మందు బిళ్ళలే మింగనక్కరలేదం టుంది ఆక్యుప్రెషర్‌ చికిత్సా విధానం. జీవితం లో ఎదుర్కొనే ఒత్తిడి నుంచి అనేక గాయాల ను తగ్గించడానికి, ముఖ సౌందర్యాన్ని పెంచుకోవడానికీ కూడా దీనిని ఉపయోగించవచ్చు. ముఖ్యంగా ముఖ సౌందర్యాన్ని పెంచుకోవడానికి, ముఖ కండరాలను రిలాక్స్‌ చేసి టోన్‌ చేయడానికి ముఖంలోని కొన్ని కేంద్రాలలో ఒత్తిడిని ఉపయోగించడమనేది చైనాలో వేల సంవత్సరాలుగా ఉపయోగిస్తున్నారు. మనలోని ఉద్వేగాలను బహిర్గతం చేయకుండా మనలోనే దాచుకున్నప్పుడు ఆ ఒత్తిడి ప్రధానంగా కండరాలపై పడుతుంది. ఆక్యుప్రెషర్‌ చేసేవారు ఈ కండరాలలోని ఒత్తిడిని విడుదల చేయించడం ద్వారా మానసిక సమతుల్యత సాధించేందుకు సాయపడతారు. అతి ప్రాచీన వైద్య విధానాలలో ఒకటైన ఇది పుట్టింది చైనాలో.

ఆక్యుపంక్చర్‌ వైద్యానికి ఉపశాఖగా దీనిని చెప్పుకోవచ్చు. ఆక్యుపంక్చర్‌లో సూదులు గుచ్చి చికిత్స చేయగా, ఇందులో కేవలం ఒత్తిడి ఉపయోగించి మాత్రమే వైద్యం చేస్తారు. కాగా ఆక్యుపంక్చర్‌కు సంబంధించిన తొలి గ్రంథం దాదాపు క్రీ.పూ. 2697- 2596 మధ్యలో రచించినట్టు చరిత్ర చెప్తోంది. ఈ గ్రంథం పేరు నీచింగ్‌. వైద్య విధానానికి సంబంధించి ప్రపంచంలోనే రచించిన తొలి గ్రంథంగా దీనిని పేర్కొంటారు. ఆధునిక వైద్యం వచ్చిన తర్వాత ఇది కొంత మరుగున పడినప్పటికీ 1935లో మావో సేటుం గ్‌ పుణ్యమా అని అది తిరిగి ప్రాచుర్యంలోకి వచ్చింది. అనంతరం 1970లో ప్రపంచ ఆరోగ్య సంస్థ అధ్యయనాలు జరిపి అది 40 అంతర్గత వ్యాధులకు చికిత్సగా ఉపయోగపడగలదని ప్రకటించింది. తర్వాత కాలంలో ఫ్రాన్స్‌లో ఇది అధిక ప్రాచుర్యం పొందింది. 



దాదాపు 3000 సమస్యలకు ఈ పద్ధతిని చికిత్సగా ఉపయొగించవచ్చని ఆక్యుప్రెషర్‌ పేర్కొంటుంది. శరీరంలో శక్తి ప్రవహించే మార్గాలలోని కొన్ని కేంద్రాలను ఒత్తిడి ద్వారా ఉత్తేజితం చేస్తుంది ఆక్యుప్రెషర్‌. వీటినే మెరీడియన్లు అంటారు. మన శరీరంలోని వివిధ అవయవాలతో అనుసంధానమయ్యే మెరీడియన్లు 14 ఉంటాయి. ఈ మెరీడియన్ల ద్వారా శక్తి సమతులంగా, సమంగా ప్రవహించినప్పుడు మనం ఆరోగ్యంగా ఉంటాం. మనం అనారోగ్యం పాలు కావడమో ఏదైనా నొప్పికి గురి కావడమో అంటే ఈ శక్తి ప్రవాహంలో ఏదో సమస్య ఏర్పడినట్టే. కనుక వచ్చిన సమస్యను బట్టి ఆక్యుప్రెషర్‌ పద్ధతిని ఉపయోగించి ఆ పాయింట్లలో ఒత్తిడి కలిగించినప్పుడు మన శరీరంలో శక్తి ప్రవాహం సవ్యంగా జరిగి ఆ రుగ్మత నుంచి దూరం అవుతాం అని ఆక్యుప్రెషర్‌ చెపుతుంది.

పెద్ద పెద్ద సమస్యలు ఉన్నప్పుడు నిపుణుల మార్గదర్శనంలో దీనిని చేయించుకోవాలి కానీ చిన్న చిన్న సమస్యలు వచ్చినప్పుడు మనం స్వయంగా దీనిని చేసుకోవచ్చు. మనం స్పర్శించినప్పుడు ఆ ప్రదేశంలో వచ్చే ప్రతి స్పందనను బట్టి పాయింట్‌ను గుర్తిస్తారు. మనకు అసౌకర్యంగా ఉన్న ప్రాంతంలో ఒక పాయింట్‌ను ఉత్తేజితం చేసినప్పుడు అసౌకర్యం ఎక్కువగా అనుభవంలోకి వస్తే దానిని లోకల్‌ పాయింట్‌ అంటారు. అలాగే మరొక పాయింట్‌ వద్ద ఒత్తిడి పెట్టినప్పుడు మనకు గల అసౌకర్యం తొలగిపోయిన భావం కలిగితే దానిని ట్రిగర్‌ పాయింట్‌ అంటారు. వీటిని గుర్తించి నిపుణులు చికిత్స చేస్తారు. అయితే మనం స్వంతగా చిన్న చిన్న సమస్యలకు మర్దనా చేసుకోవచ్చు.


ఆక్యుప్రెషర్‌ చేసే సందర్భంలో శరీరంలోని వివిధ ప్రాంతాలు వివిధ ప్రెషర్లకు స్పందిస్తాయి. ముఖం, పిక్కలు, జననేంద్రియాలు సున్నితమైన ప్రాంతాలు. వీపు, నడుము, పిరుదులు, భుజాలు వంటి ప్రాంతాలలో ఒత్తిడి కాస్త గాఢంగా ఉండాలి. ఆక్యుప్రెషర్‌ చేసే సమయంలో ఒక పాయింట్‌ను ఉత్తేజితం చేసేందుకు ఒత్తిడిని ఏడు సెకెన్ల పాటు ఉంచాలి. మన బోటనివేలు లేదా మధ్యవేలుతో గుండ్రంగా తిప్పాలి. అయితే ఆ సమయంలో పెట్టే ఒత్తిడి గాఢంగా ఉండాలే తప్ప మోటుగా ఉండరాదు. ఒక ప్రాంతం విశ్రాంతి చెందేందుకు ఒత్తిడిని నెమ్మదిగా పెంచుతూ పోవాలి అయితే ఆ సమయంలో వేళ్ళను తిప్పకూడదు. ఈ ఒత్తిడిని సుమారు నిమిషం నుంచి మూడు నిమిషాల పాటు ప్రయోగించాలి.

పెద పెద్ద కండరాలకు విశ్రాంతినివ్వాలనుకున్నప్పుడు నెమ్మదిగా బొటనివేళ్ళను, ఇతర వేళ్ళను లేదా ఆరచేయి చివరను ఆ ప్రాంతంలో నెమ్మదిగా మర్దనా చేస్తున్నట్టుగా చెయ్యాలి. చర్మంపై చురుకుగా రుద్దినప్పుడు రక్తం, శోషరస వ్యవస్థలు ఉత్తేజితం అవుతాయి. అలాగే వేళ్ళతో తబలాపై వేసినట్టుగా దరవు వేసే ముఖ కండరాలు ఉత్తేజితం అవుతాయి. అయితే వీపు, పిరుదులు వంటి ప్రాంతాలలో పిడికిళ్ళను వదులుగా బిగించి మర్దనా చేయడం వల్ల ఆ ప్రాంతాలు రిలాక్స్‌ అవుతాయి. శరీరంలో ఔజీ4 అనే పాయింట్‌ వద్ద ఒత్తిడి పెట్టినప్పుడు అది తలనొప్పులను, ఇతర నొప్పులను తగ్గిస్తుందని, కండరాల ఒత్తిడిని తొలగించి శక్తి శరీర పై, కింద భాగాలలో స్వేచ్ఛగా ప్రవహించేందుకు ఉపయోగపడుతుందని కొందరు నిపుణులు పేర్కొంటున్నారు. శరీరంలోని అతి వేడిని తొలగించేందుకు, మలబద్ధకాన్ని నివారించేందుకు కూడా ఈ పాయింట్‌పై ఆక్యుప్రెషర్‌ను ఉపయోగించడం ఎంతో ఉపయోగపడుతుందని తెలుస్తోంది. అయితే గర్భిణీ స్ర్తీలు ఈ పాయింట్‌ విషయంలో జాగ్రత్తగా ఉండాలని కూడా సూచిస్తున్నారు.
 

కొన్ని సమస్యలకు పాయింట్లు ఎక్కడ ఉంటాయో బొమ్మలతో తెలియచేస్తున్నాం.  

ఆస్త్మా :



ఆయాసం ఎప్పుడైనా రావచ్చు. దీనికి సంబంధించిన పాయింట్‌ ఔ్ఖ 5 మన మోచేతి మడత వద్ద బొమ్మలో చూపినట్టు ఉంటుంది. ఈ పాయింట్‌ పై ఒత్తిడి పెట్టడం ద్వారా మన ఊపిరితిత్తులను బలోపేతం చేసుకోవచ్చు.

సాధారణ జలుబు :

ముక్కు దిబ్బడ, జలుబు తగ్గేందుకు వివిధ పాయింట్ల వద్ద ఆక్యుప్రెషర్‌ చేయడం ఉపయోగపడుతుంది. బొమ్మలో చూపించిన పాయింట్లలో అంటే ముక్కుపుటాల వద్ద పాయింట్ల పై ఆక్యుప్రెషర్‌ చేస్తే ముక్కు దిబ్బడ తగ్గేందుకు ఉపయోగపడుతుంది. ఊపిరి స్పష్టంగా తీసుకోవాలంటే ముక్కుకు రెండు వైపులా ఉన్న పాయింట్లపై ఒత్తిడి పెంచాలి.


గొంతునొప్పి :

వాతావరణం మారినప్పుడు లేదా కొత్త చోట్లకు వెళ్ళినప్పుడు వాతావరణం పడక సోర్‌ త్రోట్‌ రావడమనేది సహజం. బొమ్మలో చూపించినట్టుగా బొటనివేలు గోరు కింద ఉన్న ఔ్ఖ 11 పాయింట్‌పై ఆక్యుప్రెషర్‌ను ఉపయోగిస్తే సోర్‌ త్రోటే కాదు, జలుబు లక్షణాలు కూడా వెంటనే తగ్గిపోతాయి. ప్రెషర్‌ను ప్రయోగించేందుకు రెండవ చేతి బొటనివేలు గోటితో కానీ టూత్‌ప్రిక్‌ లేదా ఎరేజర్‌ను కానీ ఉపయోగించవచ్చు. ఆస్త్మా వల్ల కలిగే ఇబ్బంది కూడా దీనితో తొలగిపోతుంది.
ఆందోళన తగ్గించే పాయింట్‌ :

ఈ పాయింట్‌ మన మణికట్టుకి కొద్ది దిగువన బొమ్మలో చూపించినట్టు మధ్యలో ఉంటుంది.ఈ పాయింట్లపై ఒత్తిడి ప్రయోగించడం వల్ల డయాఫ్రమ్‌ చుట్టూ స్తంభించిపోయిన శక్తి చలితమవుతుంది. ఇలా శక్తి స్తంభించిపోయినప్పుడే వ్యక్తి ఆందోళనకు లోనవుతాడు. వాంతివచ్చినట్టుగా అయినప్పుడు, తల నొప్పులకు, నిద్ర లేమి, తల తిరుగుడు వంటి సమస్యలు ఉన్నప్పుడు కూడా దీనిని ఉపయోగించవచ్చు.

గొంతు బొంగురు పోయినప్పుడు :

ఇది అరచెయ్యి వెనుక ఉంగరం, చిటికెన వేళ్ళ మధ్య బొమ్మలో చూపినట్టుగా ఉంటుంది. ఇది పని చేస్తున్నదో లేదో తెలుసుకోవాలంటే ముందుగా గాలి పీల్చి ఆ పాయింట్‌పై బొటనివేలితో ఒత్తిడి పెట్టి ఒక గుటక వేయాలి. వెంటనే తేడా తెలిస్తే అది సరైన పాయింట్‌ అన్నమాట. ఒకవేళ అలా జరుగకపోతే తరువాత పాయింట్‌కు వెళ్ళాలి.మనం స్వయంగా ఆక్యుప్రెషర్‌ చేసుకునేటప్పుడు విశ్రాంతిగా ఉండే ప్రాంతాన్ని ఎంచుకోవాలి. అలాగే మరీ బిగుతుగా లేని దుస్తులను ధరించాలి. ఆక్యుప్రెషర్‌ స్వయంగా చేసుకోవాలనుకునే వాళ్ళు వేలిగోళ్ళను కత్తిరించుకోవాలి. లేదంటే చర్మంపై గోళ్ళు గుచ్చుకొని ఇబ్బందులు వస్తాయి. అన్నం తినబోయే ముందు భారీగా తిన్న తరువాత ఆక్యుప్రెషర్‌ చేయకూడదు. భోజనం అయిన కనీసం రెండు గంటలపాటు ఇది చేయకూడదు. ఆక్యుప్రెషర్‌ పూర్తి అయిన తరువాత చల్లటి నీళ్ళు తాగరాదు. అవసరమైతే హెర్బల్‌ టీ తాగడం మంచిది. అలాగే ఎక్కువ సేపు చేయడం కూడా మంచిది కాదు. పొట్టమీద, ముఖంపై చేసేటప్పుడు 15 నిమిషాలకు మించి చేయకూడదు.
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top