స్పైసీ ఆలూ


కావలసినవి
ఆలుగడ్డలు - 300గ్రా
పచ్చిమిర్చి -రెండు లేక మూడు
గరమ్ మసాల -ఒక స్పూన్
నూనె - మూడు స్పూన్స్
ఎర్రకారం - ఒక స్పూన్
ఆవాలు ఒక అరస్పూన్
మరాటి మొగ్గ - రెండు
చింతపండు రసం - ఒక పావు చెంచా
ఉప్పు - తగినంత,
పెరుగు -50గ్రా
వెల్లుల్లి ముక్కలు - కొంచెం
గార్లిక్ పేస్టు- అరస్పూన్
అల్లం పేస్టు - ఒక స్పూన్
తయారీ విధానం
ఆలుగడ్డలు చెక్కుతీసి ఉడికించుకుని ముక్కలు చేసుకొని పెట్టుకోండి. కడాయిలో నూనె వేడిచేసుకొని ఆవాలు వేయండి. 

అవిచిటపటలాడుతుండగా అల్లం, వెల్లుల్లి ముద్దను,మిగతా మసాలాన్నంతా చేర్చండి.పెరుగుకూడా చేర్చండి. ఈ మిశ్రమం చిక్కబడుతుండగా ముక్కలుగా చేసుకొన్న ఆలును వేసి బాగాకలుపుతూ పదిహేను నిమిషాలు మూతపెట్టి మగ్గనివ్వండి. స్పైసీ ఆలు తయార్.
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top