క్యాబేజీ బుల్లెట్స్


కావలసినవి  :
సన్నగా తరిగిన క్యాబేజీ - రెండు కప్పులు
అల్లం పచ్చిమిర్చి పేస్ట్ - టీ స్పూను
బ్రెడ్ స్లైసెస్ - రెండు (చిన్నవి)
కొత్తిమీర - కొద్దిగా
పుదీనా - కొద్దిగా
నూనె - వేయించడానికి తగినంత
ఓట్స్ పిండి - మూడు కప్పులు (ఉండ చేయడానికి చాలకపోతే మరికాస్త తీసుకోవచ్చు)

తయారి
సన్నగా తరిగిన క్యాబేజీ, అల్లంపచ్చిమిర్చి పేస్ట్, కొత్తిమీర, పుదీనా, ఉప్పు, బ్రెడ్ స్లైసెస్ (నీళ్లలో ముంచి తీసి నీరు పిండేయాలి) వేసుకుని అన్నిటినీ బాగా కలపాలి. తరవాత ఇందులో ఓట్స్‌పిండి కూడా వేసి, అవసరం అనుకుంటే కొద్దిగా నీళ్లు పోయాలి. ఉండ చేసుకోవటానికి వీలుగా పిండిని కలుపుకుని బుల్లెట్స్‌లా చేయాలి. బాణలిలో నూనె వేడయ్యాక అందులో వేసి దోరగా వేయించుకోవాలి. (పిండి కలిపిన తరువాత చేతులు కడిగేసుకుని, వడలు చేసేటప్పుడు చేయి తడుపుకున్నట్టుగా చేసుకుంటే చేతికి అంటుకోకుండా ఉంటాయి) .



block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top