సీరియళ్ల బాగోతాన్ని పట్టించుకునేదెవరు?


లోకంలో ఎక్కడో ఓ చోట.. ఏదో రీతిన వెళ్లగక్కే కక్షలూ కార్పణ్యాలూ - పగలూ ప్రతీకారాలూ.. ఇప్పుడు ఏకంగా ఛానెళ్లకు కాసుల పంట పండిస్తున్నాయి. నిన్న మొన్నటి వరకూ - రియాల్టీ షోలలో అర్థంపర్థంలేని ‘బూతు’ ప్రహసనం విజృంభించింది. కోర్టు ఒక్క మొట్టికాయ మొట్టి అటువంటి ‘షో’లన్నీ అర్ధరాత్రిళ్లు పెట్టుకోండి అనటంతో - పరిస్థితి కాస్తంత సద్దుమణిగినా - రోజువారీ సీరియళ్లలో అంతకంటె ఘోరమైన బాగోతాలు ఎన్ని కనిపించటం లేదు?! ఏ భార్యామణిని తీసుకున్నా - ఆవిడగారి జీవితం సజావుగా నడవదు. ఉన్నట్టుండి ఆఫీస్‌లో స్టెనో రూపంలోనో.. రోడ్డు మీద వెళ్లే అమ్మాయి రూపంలోనో సంసారాన్ని కాటువేస్తుంది. ఇక అక్కడ్నుంచీ కథ ఎన్ని మలుపులు తిరగాలో అన్ని మలుపులూ తిరుగుతుంది. తీరా చెప్పొచ్చిన నీతి ఏమిటంటే - సంసారం అనే బండికి చక్రాలై భార్యాభర్తలు మాత్రమే తిరిగే సరిపోదు. ఏ మజా ఉండదు. పక్కనే ఓ ‘స్టెపినీ’ ఉంటే బహు బాగుంటుందన్నది. కొన్నాళ్ల క్రితం - కథలోని పాత్రలన్నీ నిండుగా చీర కప్పేసుకుని - బోలెడంత సంస్కృతీ సంప్రదాయాలను ఒలకబోసేవి. ఆ హద్దుల్ని చెరిపేసి - తాజాగా ‘హాఫ్ నేకెడ్’ సీన్లు ప్రత్యక్షమవుతున్నాయి. ఆ విషయాన్నీ పోనిద్దాం. ఒకానొక సందర్భంలో ‘రేప్’ ఏ విధంగా జరిగిందన్నది ఎపిసోడ్ల కొద్దీ ప్రవహిస్తుంది. అన్నీ మానవీయ సంబంధాలే. అన్నీ ‘ఎక్స్‌ట్రా మార్టియల్ అఫైర్సే’. ఇది రోజువారీ తంతు. ఏ ప్రేమకథనో - వాస్తవ సంఘటనల ఆధారంగానో.. జరిగిన కథ అంటే ప్రేక్షకులు మా ఛానెళ్ల వైపు తొంగి చూడరు అనుకుంటారేమో?! ఇలా ఒకటా రెండా? లెక్కకు మించి. ‘బిగ్ బాస్’ ‘రాఖీ కా ఇన్సాఫ్’ షోల వైపు కోర్టు దృష్టి మళ్లించక మునుపు - గత సంవత్సరం ఈ రీతిన స్టార్ ప్లస్‌లో ప్రసారమైన ‘సచ్ కా సామ్‌నా’ షోలో అభ్యంతరకర అంశాలు ఉండటంవల్ల రాత్రి 11 గంటల తర్వాత ప్రసారం చేసుకోమని ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుతం ప్రభుత్వం దృష్టి ‘దాదాగిరి’ ‘పతి పత్నీ ఔర్ వో’ ‘నా ఆనా ఇస్ దేశ్ లాడూ’ ‘సర్కార్ కీ దునియా’ ‘ఇస్ జంగిల్ సే ముఝే బచావో’ ‘ఎమోషనల్ అత్యాచార్’లపై పడింది.

                       కేబుల్ నెట్‌వర్క్స్ రెగ్యులేషన్ యాక్ట్, 1995 లో పేర్కొన్న అంశాలేవీ ఛానెళ్లు పాటిస్తున్న దాఖలాలు కనిపించటం లేదు. స్టార్ ఇమేజిన్, సహారా ఛానెళ్ల సీనియర్ ప్రోగ్రామర్ నీలాంజన పి. ఇదే అంశాన్ని ఉటంకిస్తూ - ‘అభ్యంతరకరమైన’ మాటకి అర్థం ఏమిటి? ఇదొక వెరైటీ కానె్సప్ట్. రియాక్షన్స్‌ని విభిన్న రీతిలో చూపిస్తున్నాం. ఉదాహరణకి ‘బాలికా వధు’ సీరియల్‌లో ఒక అబ్బాయి అండర్‌వేర్‌ని తీసేస్తాడు. ఇది పూర్తిగా ర్యాగింగ్ మహమ్మారి వల్ల యువత ఎదుర్కొంటున్న సమస్యల్ని వేలెత్తి చూపాం. ర్యాగింగ్ అనేది రియాలిటీ. ఇందులో ఫిక్షన్ లేదు. సహజత్వాన్ని ప్రతిబింబించటం తప్పు ఎలా అవుతుందో అర్థం కావటం లేదంటారాయన.
సోనీ ఛానెల్ మాజీ ప్రోగ్రామింగ్ హెడ్ సంజయ్ ఉపాధ్యాయ మాట్లాడుతూ - వాస్తవ సంఘటనలను తెర కెక్కించటంలో ఒక బాధ్యత ఉంది. పరిధులకు లోబడి చిత్రీకరిస్తున్నామే తప్ప మరో ‘అభ్యంతరకర’ అంశానికి తావులేదు. కథలు సమాజం నుంచి రాక ఇంకెక్కడ్నుంచీ వస్తాయి’ అంటూ ఎదురుప్రశ్న వేస్తున్నారు.
ప్రసారం చేస్తున్నంత మాత్రాన అన్ని సీరియళ్లు చూడాల్సిన ‘బాధ్యత’ ప్రేక్షకులది కాదు. ఛానెల్‌కి ‘రిమోట్ కంట్రోల్’ ఉంటుంది. తల్లిదండ్రుల కట్టడి తప్పనిసరి. అలాంటప్పుడు సమాజంపై విపరీత పరిణామం పడదు అంటారు నటుడు రోనిత్ రాయ్. ‘విలువలకూ - వ్యాపారానికీ మధ్య సంఘర్షణ ఇది. వ్యాపార దృక్పథాన్ని వదులుకోలేం. విలువలనూ వదులుకోలేం. రెంటికీ న్యాయం చేయటం కొద్దిగా కష్టమైనప్పటికీ - ఒక నియంత్రణ అనేది ఉండటం ముఖ్యం. ఏదైనా ‘అతి’ పెడర్థాలను తీస్తుంది అంటోంది స్మృతి ఇరానీ.
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top