బ్యాక్ పెయిన్ తగ్గేదెలా...?


బ్యాక్ పెయిన్ చాలా మందిలో సాధారణంగా కనిపించే సమస్య. ఎక్కువగా ప్రయాణం చేసే వారిలో, శారీరక శ్రమ, ఎక్కువ గంటలు కూర్చుని పని చేసే వారిలోనూ ఇది కనిపిస్తూ ఉంటుంది. కారణాలు యుక్తవయస్కుల్లోనూ, వయసు పైబడిన వారిలోనూ లో బ్యాక్ పెయిన్ వస్తుంది. ఈ రెండు ఏజ్ గ్రూపుల వారిలో వేరు వేరు కారణాల వల్ల ఈ నొప్పి వస్తుంది. యుక్త వయస్కుల్లో బ్యాక్ పెయిన్‌కు ప్రధానంగా ట్రామా(దెబ్బలు తెగలడం), లైఫ్‌స్టయిల్, వెహికిల్ ఎక్కువగా నడపడం వంటివి కారణాలుగా ఉంటాయి. వయసు పైబడిన వారిలో డీజనరేటివ్ కారణాల వల్ల బ్యాక్ పెయిన్ వస్తుంటుంది. డిస్క్‌ల మధ్యన ఉండే వాటర్ కంటెంట్ తగ్గిపోవడం కూడా కారణమే. ఇవే కాకుండా కిడ్నీ సమస్యలు, ఆపెండిసైటిస్, ఓవరీ డిజార్డర్స్, ఇతర గైనకాలజీ సమస్యలు ఉన్నప్పుడు కూడా వెన్ను కింది భాగంలో నొప్పి వచ్చే అవకాశం ఉంటుంది. సాధారణ బ్యాక్ పెయిన్ ఉన్నప్పుడు విశ్రాంతి తీసుకుంటే తగ్గిపోతుంది. అలాకాకుండా నొప్పి కాలుకు కూడా పాకితే సమస్య తీవ్రంగా ఉన్నట్లు పరిగణించాల్సి ఉంటుంది.

లక్షణాలు
వెన్ను కింది భాగంలో నొప్పి ఉంటుంది. కొందరికి నొప్పి సడన్‌గా వస్తుంది. మరి కొందరికి నొప్పి కంటిన్యూస్‌గా ఉంటుంది. వ్యాయామం చేసినపుడు, చల్లగాలిలో తిరిగినపుడు కూడా నొప్పి ఉంటుంది. నొప్పి కాలుకు కూడా విస్తరిస్తుంది. మూత్రవిసర్జన, మలవిసర్జన కష్టంగా మారుతుంది. ఎక్కువ సేపు కూర్చుని పనిచేయలేరు. వాహనం నడపటానికి ఇబ్బంది పడుతుంటారు.

నిర్ధారణ
ఏ కారణం చేత నొప్పి వస్తోందో ముందుగా తెలుసుకోవాలి. కిడ్నీ సమస్య ఏమైనా ఉందా.. గైనకాలజీ సమస్యల వల్ల నొప్పి వస్తోందా.. అనే విషయాన్ని పరిశీలించాలి. ఇతర కారణాలు ఏవీ లేవని తేలితే స్పైన్ వల్ల నొప్పి వస్తున్నట్లుగా భావించాలి. సమస్యను గుర్తించడం కోసం ఎక్స్‌రే, ఎమ్ఆర్ఐ పరీక్షలు చేయించాల్సి ఉంటుంది. ఈ పరీక్షల ద్వారా డిస్క్ సమస్యలున్నా, నర్వ్ మీద ఒత్తిడి పడుతున్నా స్పష్టంగా గుర్తించే వీలుంది.



చికిత్స
నొప్పి వచ్చినపుడు రెండు మూడు వారాల పాటు విశ్రాంతి తీసుకోవాలి. నొప్పి నివారణ మాత్రలు వేసుకుంటూ వీపు కండరాలు బలపడే వ్యాయామాలు చేయాలి. అలాకాకుండా రోజూ వారి పనిచేసుకోవడం ఇబ్బందిగా మారినపుడు, నొప్పి కాలుకు(సయాటికా) విస్తరించినపుడు, మూత్ర విసర్జనలో ఇబ్బంది ఎదురవుతున్నప్పుడు, మందులతో నొప్పి తగ్గనప్పుడు సర్జరీ చేయించుకోవాలి. ప్రస్తుతం మైక్రోస్కోపిక్ డిస్కెక్టమీ, ఎండోస్కోపిక్ డిస్కెక్టమీ అనే పద్ధతుల్లో సర్జరీ చేస్తున్నారు. ఇందులో బయటకు వచ్చిన డిస్క్‌ను తొలగించడం, నర్వ్ మీద పడుతున్న ఒత్తిడిని తీసివేయడం జరుగుతుంది. దీనివల్ల నొప్పి నుంచి త్వరగా ఉపశమనం లభిస్తుంది. యాంటీ స్ట్రెస్ థెరపీ కూడా బాగా ఉపయోగపడుతుంది.

నివారణ
బ్యాక్ పెయిన్ రాకుండా ఉండాలంటే కొన్ని జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. వాటిని దినచర్యలో తప్పకుండా ఆచరించాలి. ఆఫీసులో పనిచేసేటప్పుడు సరిగ్గా కూర్చోవడం, వంగాల్సి వచ్చినపుడు సడన్‌గా బెండ్ కాకుండా ఉండటం, నిలబడినపుడు ఒక కాలు కొంచెం పైన పెట్టుకోవడం వంటివి చేయాలి. స్పైన్ నిటారుగా ఉండేలా చూసుకోవాలి. పడుకునేటప్పుడు దిండును కాళ్ల కింద పెట్టుకోవాలి. బల్లపైన పడుకోవడం అలవాటు చేసుకోవాలి.
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top