మలై రోల్ కర్రీ


కావలసిన పదార్థాలు
పాలు - ఒక లీటరు

పాలక్రీమ్ - ఒక టీ స్పూన్
నిమ్మకాయ - ఒకటి
తెల్లమిరియాల పొడి- పావు టీ స్పూన్
అల్లం వెల్లుల్లి పేస్టు - ఒక టీ స్పూన్
ఉల్లిపాయలు - 100గ్రా
పచ్చి మిరపకాయలు - ఆరు
జీడిపప్పు - 20గ్రా
తర్బుజా విత్తనాలు - 20గ్రా
గసగసాలు - 20గ్రా
పెరుగు - ఒక కప్పు
మిరపపొడి - ఒక టీ స్పూన్
పసుపు - పావు టీ స్పూన్
గరం మసాలా - పావు టీ స్పూన్
 ఉప్పు - తగినంత
నూనె - సరిపడా.

తయారుచేయు విధానం
ముందుగా పాలను కాచి నిమ్మరసం కలపాలి. నిమ్మరసం కలపడంతో పాలు విరుగుతాయి. తరువాత ఆ పాలను వడగట్టి ఒక సన్నటి వస్త్రంలో మూట కట్టిపెట్టాలి. ఇందులోని నీరంతా పోయి పాల ముద్ద మిగులుతుంది. ఈ మిశ్రమానికి పాలక్రీమ్, తెల్లమిరియాల పొడి కలుపుకోవాలి.
 దీన్ని చిన్న చిన్న ముద్దలుగా తీసుకుని చిటికెన వేలు మందంతో రోల్స్‌గా చుట్టాలి. వీటిని ఓ ప్లేట్‌లో ఉంచి ఆవిరి మీద ఉడికిస్తే మలైరోల్స్ తయారవుతాయి. తరువాత ఉల్లిపాయలను ఉడికించి వాటికి పచ్చి మిర్చి కలిపి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. జీడిపప్పు, తర్బుజా విత్తనాలు, గసగసాలు కలిపి ముద్దగా నూరుకోవాలి. ఇప్పుడు ఒక పాత్రలో నూనె వేసి కాస్త వేడి అయ్యాక ఉల్లిపాయ ముద్ద వేసి వేయించాలి.

తరువాత జీడిపప్పు, అల్లం వెల్లుల్లి, గరం మసాలా వేసి ఫ్రై చేసుకోవాలి. అందులోనే మిరపపొడి, పసుపు, ఉప్పు వేసి మరి కాసేపు వేయించాలి. ఇప్పుడు పెరుగు వేసి కలుపుకోవాలి. ఇందులో ఆవిరిపై ఉడికించిన మలైరోల్స్ వేసి చిన్న మంటపై ఐదు నిమిషాలు పాటు ఉడికించుకోవాలి. అంతే.. మలై రోల్ కర్రీ రెడీ. 
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top