అందం కోసం విటమిన్లు


అందమె ఆనందం.. ఆరోగ్యమే అందం... ‘‘ఎ థింగ్ ఆఫ్ బ్యూటీ జామ్ ఫరెవర్’’ ఇవన్నీ మంచి ఆరోగ్యం వున్నప్పుడే లభిస్తాయి. అందానికి మొదటి పెట్టుబడి ‘ఆరోగ్యం’. ఈసురోమని మనిషి ఉంటే.. బుగ్గల నిగారింపు లెక్కడా? సరే.. ఇంతకీ అందం పెరగాలంటే ఏయే విటమిన్లు వాడాలో చూద్దాం.
విటమిన్-ఇ:
* ఇ-విటమిన్ అన్ని సౌందర్య ఉత్పత్తుల్లోనూ వాడతారు.
* పడతుల మేని మెరుగుకు ఈ విటమిన్‌ది అగ్రస్థానం
* ప్రీరాడికల్స్ ప్రభావం నుండి చర్మాన్ని రక్షిస్తుంది.
* లైటనింగ్ రాడ్‌గా పిలవబడే ఈ విటమిన్ కణక్షాన్ని నివారిస్తుంది.
* అతి నీలలోహిత కిరణాల హానీ నుండి రక్షిస్తుంది.
* పొద్దుతిరుగుడు నూనె, బాదంపప్పులు, పాలకూర, టమెటో, బొప్పాయి, ఆలివ్ నూనె వంటి వాటిలో ‘ఇ-విటమిన్’ పుష్కలంగా లభిస్తుంది.
విటమిన్-ఎ:
* కంటికి కాంతినిస్తుంది
* మిలమిల మెరిసేటట్లు చేస్తుంది.
* చర్మానికి నిగారింపు నిస్తుంది.
ఆకుకూరలు, బొప్పాయి, తాజాపండ్లు, చేపలు వంటి వాటిల్లో ‘ఎ’ విటమిన్ విరివిగా లభిస్తుంది.
విటమిన్-బి:
* రక్త హీనతను నివారిస్తుంది.
* నాలుకపై నోట్లో పుండ్లు రాకుండా ఆపుతుంది.
ఆడించిన బియ్యం, గోధుమ నూకల్లో ‘బి’ విటమిన్ లభ్యమవుతుంది.
విటమిన్-సి:
* ఎనిమియా అరికడుతుంది.
* వ్యాధి నిరోధక శక్తి పెంచుతుంది.
* శరీరానికి ‘ఐరన్’ అందేలా చేస్తుంది.
* పుల్లని పండ్లు - నిమ్మ, నారింజ, బత్తాయి దీని సోర్స్

విటమిన్-డి:
* రోజూ సాయంత్రంపూట ఎంత కాంతి పడేలా వుంటే చర్మానికి ‘డి’ లభిస్తుంది.
నీరసం... కాల్షియం లోపం. దీనివల్ల పోతాయి. పూర్తిగా ఉడికించిన మియ్యం, కూరలు తింటే శరీరానికి కొత్త శక్తి అందమూ వస్తాయి. కారణం విటమిన్లు నశించకపోవడమే.
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top