గర్భాశయ వ్యాధులకు తైలాలు-1

తరుచూ గర్భస్రావం అయ్యే స్త్రీలకు ఒక పక్క రోజూ ఈ తైలంతో అభ్యంగన స్నానం చేయిస్తూనే పంచకర్మ చికిత్సా సూత్రాల ఆధారంగా 'ఉత్తర వస్తి' చికిత్స చేయవలసి ఉంటుంది. ఈ చికిత్సలో తైలాన్ని గర్భాశయంలోకి ప్రయోగిస్తారు. అదే సమయంలో కడుపులోకి మాత్రలు కూడా వాడాలి. ఇలా చేయడం వల్ల మాటి మాటికీ గర్భస్రావం అయ్యే పరిస్థితి తప్పుతుంది. 

ఆయుర్వేద ఔషధ తైలాలు కేవలం తలవె ంట్రుకలకో, కీళ్లనొప్పులకో, పక్షవాతాలకో మర్ధన రూపంలో మాత్రమే వాడేవి కావు. వాస్తవానికి ఊపిరి తిత్తులు మొదలు, గర్భాశయ వ్యాధుల వరకు ఉపయోగపడతాయి. నవజాత శిశువు మొదలుకుని పండు ముదుసలి వర కు వీటి ద్వారా ప్రయోజనం పొందవచ్చు.

మర్ధనతో పాటు కడుపులోకి కూడా ఈ తైలాలను వినియోగించడం ద్వారా అనేక సమస్యలు నయమవుతాయి. ముఖ్యంగా వివిధ అవయవాల్లో వచ్చే వాత సంబంధ వ్యాధులన్నిటికీ ఈ తైలాలతో ప్రయోజనం ఉంటుంది. తైలాల తయారీలో వాడే నువ్వుల నూనె వ్యాధిగ్రస్తమైన అవయవాలకు ఔషధ గుణాలను చేరవేయడంలో ఒక వాహకంగా పనిచేస్తుంది.

నువ్వుల నూనెలోని 'ట్రైగ్లిజరైడ్స్' అనే కొవ్వు పదార్థాలు ఔషధ గుణాలను ఆయా భాగాలకు చేరవేయడంలో తోడ్పడతాయి. అందుకే తైలాలు కేవలం మర్ధనగానే కాకుండా ట్రైగ్లిజరైడ్స్ రూపంలో శరీరంలో ఇంకి జీవరసాయన చికిత్సగా కూడా పనిచేస్తాయని గ్రహించాలి.


ఔషధ తైలాలను మామూలుగా తయారు చేసినప్పుడు ఒంటి పైన మర్ధనకే ఉపయోగపడతాయి. అలా కాకుండా ' ఆవర్తిత తైలపాక విధానం'లో తయారు చేసినప్పుడు మర్ధనతో పాటు కడుపులోకి కూడా ఇస్తారు. అలాగే చెవి, ముక్కు, కళ్లు, నోటిలోకి ఇవ్వడంతో పాటు ఆయుర్వేద నిపుణులు మల, మూత్ర, గర్భాశయ మార్గాల ద్వారా (వస్తికర్మ) కూడా శరీరంలోకి పంపుతారు. స్త్రీ సంబంధిత వ్యాధుల్లో ప్రత్యేకించి కొన్ని గర్భాశయ సమస్యల గురించిన వివరాలివి.

శ్రీగోపాల తైలం
గర్భాశయ వ్యాధుల నుంచి ఉపశమనానికి ఈ తైలాన్ని విశేషంగా వాడుకోవచ్చు. ఈ తైలాన్ని తయారు చేయడానికి శతావరి, కూష్మాండం, ఆమలకీ, అశ్వగంధ, బలా బిల్వా, అగ్నిమంథ, గంభారీ, పాటలా, శ్యోనాక, బృహతీ, మూర్వా, కేతకీ, పారిభద్ర, కరంజ వంటి వాటి కషాయం 16 భాగాలు తీసుకుంటారు.

ఆ తరువాత అశ్వగంధ, చోరపుష్పీ, పద్మాఖ, కంటకారీ, బలా, ఆగరు, ముస్తా, శిలారసం, చందనం, త్రిఫళా, మూర్వా, జీవనీయ వంటి మూలికలు, యష్టిమధు, శొంఠి, మరిచ, పిప్పళ్లు, కేశర, కస్తూరి, ఏలా, దాల్చినా నాగకేశర, జటామాంసి, దేవదారు, వచ, దాడిమా, ధనియా, దమనం వంటి వాటి చూర్ణంతో తయారు చేసిన ముద్ద ఒక భాగం తీసుకుంటారు.



ఈ ఔషధాల గుణాలన్నిటికీ వాహకంగా నువ్వుల నూనె నాలుగు భాగాలు చేరుస్తారు. వీటన్నిటినీ ఒక పాత్రలోకి తీసుకుని తైలం మిగిలేలా పొయ్యిపైన నెమ్మదిగా కాచి తయారు చేస్తారు. చి తరుచూ గర్భస్రావం అయ్యే స్త్రీలకు ఒక పక్క రోజూ ఈ తైలంతో అభ్యంగన స్నానం చేయిస్తూనే పంచకర్మ చికిత్సా సూత్రాల ఆధారంగా 'ఉత్తర వస్తి' చికిత్స చేయవలసి ఉంటుంది.

ఈ చికిత్సలో తైలాన్ని గర్భాశయంలోకి ప్రయోగిస్తారు. అదే సమయంలో కడుపులోకి మాత్రలు కూడా వాడాలి. ఇలా చేయడం వల్ల మాటి మాటికీ గర్భస్రావం అయ్యే పరిస్థితి తప్పుతుంది. ఈ తైలంతో నస్యకర్మ చేయిస్తే స్త్రీలలో ఉండే సంభోగ వైముఖ్యత (ఫ్రిజిడిటి) కూడా తగ్గుతుంది. సంసార జీవితంలోని లోపాల వల్లగానీ, కుటుంబపరమైన ఒత్తిళ్ల వల్లగానీ కొంత మంది స్త్రీలు ఉన్మాదం, అపస్మారం( హిస్టీరియా) వంటి వ్యాధులకు గురవుతూ ఉంటారు. ఈ తరహా సమస్యలను కూడా ఈ తైలం దూరం చేస్తుంది.

నతాది తైలం

 తగరం(నత), బృహతీ, కోష్టు, సైందవలవణం, దేవదారు వన మూలికలతో కషాయ ద్రవం, కల్కం ( చూర్ణం ముద్ద)గా ఉపయోగిస్తూ తగిన మోతాదులో నువ్వుల నూనె కలిపి తైలపాక విధిలో ఆయుర్వేద వైద్యులు ఈ తైలాన్ని తయారు చేస్తారు. ఇలా తయారైన తైలాన్ని టాంప్యూన్ లేదా స్టెరైల్ డ్రెస్సింగ్ ప్యాడ్ తో తడిపి జననాంగం ద్వారా స్త్రీ గర్భాశయంలోకి ప్రవేశపెడతారు. నిపుణులు వ్యాధిని అనుసరించి చికిత్సా సమయాన్ని నిర్ణయిస్తారు.

- గర్భాశయంలోని కండరాలు సడలిపోయిన కారణంగా బహిష్టు కాలంలో తన సహజమైన కదలికలను కోల్పోయినప్పుడు 'రుతుశూల' (డిస్మెనూరియా) సమస్య తలెత్తుతుంది. ఈ తరహా స్త్రీ సమస్యలను నదాతి తైలాన్ని 'ఉత్తరవస్తి' విధానంలో ఇవ్వడం ద్వారా తగ్గించవచ్చు.

- జననాంగం, గర్భాశయంలో వాపు, నొప్పి, (వజైనైటిస్, సెర్విసైటిస్, ఎండోమెట్రైటిస్) వంటివి కూడా ఈ తైల చికిత్సలతో తగ్గుతుంది. ఇందుకు తైలాన్ని జననాంగంలోకి పంపడంతో పాటు పొత్తి కడుపు, న డుము, తొడలు, పిరుదుల పైన తైలంతో మర్ధన కూడా చేయాలి. 
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top