Telugu Funny Jokes - 2


నాల్గోవాడు

"నా నలుగురు కొడుకుల్లో ముగ్గురు ఎం.బి.ఏ. చేశారు''
"మరి నాల్గోవాడు?''
"వాడా ... ఒక క్షౌరశాల నడిపిస్తున్నాడు''
"ఎంత అవమానం ... అలాంటి వాడ్ని ఎలా భరిస్తున్నావ్? నేనైతే ఇంట్లోంచి వెళ్లగొట్టేవాడ్ని''
"నిజమే కానీ ... మమ్మల్నందర్నీ పోషించేది వాడేగా మరి''


పువ్వుకొక్క ముద్దా?
సుమంత్ ఒక గులాబీ పువ్వు ఇచ్చి రమోలాకి బర్త్ డే గ్రీటింగ్స్ చెప్పగానే సంతోషంగా ఒక ముద్దిచ్చింది ఆమె.
వెంటనే 'ఇప్పుడే వస్తానంటూ' కంగారుగా పరిగెట్టబోతున్న సుమంత్‌ని ఆపి, ఎక్కడకని అడిగింది రమోలా.
"బొకే తెద్దామని'' బిడియపడుతూ చెప్పాడు సుమంత్.



గొప్ప వంశం
"ఇప్పుడు ఒక్కొక్కరే నిలబడి మీ వంశం గొప్పతనం గురించి చెప్పండి'' అంది టీచర్.
"మా అమ్మానాన్నలు, తాతా నానమ్మలు ఒకర్నొకరు అనుకోవడం వల్ల తెలిసిందేమంటే పంది, గాడిద, కోతి, పులి ... ఇవన్నీ మా పూర్వీకులని.
మాది సకల జంతు సమాహార వంశం టీచర్'' చేతులు కట్టుకుని బుద్దిగా చెప్పాడు రాజేష్. 



కిళ్లీ మందు
సినిమా హాల్లోకి వెళ్లబోతూ భార్యకు కిళ్లీ కట్టించాడు గోపాల్.
"అదేంటండీ! నా ఒక్కర్తికేనా? మీరు కూడా కట్టించుకోలేకపోయారా?'' కిళ్లీ నోట్లో వేసుకోబోతూ గోముగా అడిగింది కాంతం.
"వద్దులే కాంతా ... కిళ్లీ లేకపోయినా నేను నోరు మూసుకుని సినిమా చూడగలను'' చెప్పాడు గోపాల్.



ఈ ప్రూఫ్ సరిపోదు
అప్పుడే అందిన పార్శిల్లో విప్పి చూస్తున్న ధనుంజయ్ జేబులో సెల్ రింగయ్యింది.
"నీకు అందిన పార్శిలో మీ ఆవిడ చిటికెనవేలు గుర్తుపట్టావా? వెంటనే మేం అడిగినంత డబ్బు ఇస్తే మీ ఆవిడ్ని వదిలేస్తాం'' అవతల్నించి కిడ్నాపర్‌ల దబాయింపు వినబడింది.
"లేదు... నాకు ఈ ప్రూఫ్ సరిపోదు'' కూల్‌గా అంటూ ఫోన్ కట్ చేశాడు ధనుంజయ్.  



తండ్రి ప్రేమ
 కొడుకు హాస్పటల్‌లో ఉన్నాడని తెలిసి పరుగు పరుగున వచ్చిన తండ్రి కొడుకు పాదాలు రెండూ కట్లు కట్టి ఉండటం చూస్తూనే "ఓరి భగవంతుడా'' అంటూ తల పట్టుకున్నాడు.
"గుండె రాయి చేసుకోవాలి'' ఓదార్చాడు డాక్టర్.
"నిన్ననే వీడికి కొత్త చెప్పుల జత కొన్నా డాక్టర్'' అసలు విషయం చెప్పి బావురుమన్నాడు తండ్రి..


భలే మంచి చౌక బేరము!
 "నీ విడాకులకు 50 వేలు ఖర్చవుతుంది''
"అదేంటి లాయర్! నా పెళ్లి ఖర్చంతా కలిపి రెండున్నర వేలు కాలేదు'' ఆశ్చర్యపోయాడు రాజారావు.
"దురాశ దుఃఖానికి చేటని వినలేదా! చౌకగా వచ్చిందని ఏది కొన్నా ... తర్వాత మూల్యం మరింత చెల్లించాల్సి ఉంటుంది'' చెప్పాడు లాయర్. 
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top