Telugu Funny Jokes - 3

సేమ్ ఇబ్బంది...
భార్య: ఏమండీ, మీ అమ్మగారితో చాలా ఇబ్బందిగా ఉందండీ... అవునంటే కాదంటుంది. కాదంటే అవునంటుంది...
భర్త: నాకు కూడా మీ నాన్నతో సేమ్ ప్రాబ్లమ్, ఏం చేద్దాం మరి...
టికెట్....

స్టేడియంలో క్రికెట్ మ్యాచ్ జరుగుతోంది.
గ్యాలరీలో కూర్చున్న పెద్దాయన చాలాసేపటి నుంచి తొమ్మిదేళ్ల రామునే చూస్తున్నాడు.
తల్లిదండ్రులు... కనీసం పెద్దవాళ్లు కూడా లేకుండా ఒక్కడే మ్యాచ్ చూడ్డానికి ఎలా వచ్చాడా? అని ఆలోచించసాగాడు.
చివరికి ఉండబట్టలేక -
‘‘ఏం బాబూ! టికెట్ చాలా ఖరీదు కదా, ఎవరు కొన్నారు?’’ అని అడిగాడు.
రాము: డాడీ
పెద్దాయన: మరి ఆయనేరి?
రాము: ఈ టికెట్ కోసం ఇంట్లో వెదుకుతున్నారు...
పెద్దాయన: !!!


ఏ ఎండకా గొడుగు....

"అదేంటి ఆరునెలల క్రితం సురేష్ బి.ఏ. అని బోర్డు ఉండేది. ఇప్పుడు సురేష్ ఎం.ఏ. అని తగిలించారు. ఎలా సా«ధ్యం?'' ఆశ్చర్యంగా అడిగాడు సన్యాసిరావు.
"నా భార్య పోయిన కొత్త కాబట్టి బి.ఏ. (బాచిలర్ ఎగైన్) అని రాసుకున్నాను. ఇప్పుడు పెళ్లయింది కాబట్టి ఎం.ఏ. (మేరేజ్ ఎగైన్) అని రాసుకున్నాను'' చెప్పాడు సురేష్ .



బేగాన్/పారగాన్.....
చెత్త కుండీలో కొస ప్రాణంలో ఉన్న రెండు బొద్దింకలు ఇలా మాట్లాడుకున్నాయి.
"నీది కూడా బేగాన్ దెబ్బేనా?'' మొదటి బొద్దింక.
"కాదు... పారగాన్ దెబ్బ'' మూలుగుతూ చెప్పింది రెండో బొద్దింక.



తింగరి వరుడు.....
శోభనం రాత్రి గదిలోకి అడుగుపెట్టిన పెళ్లికూతుర్ని చూసి కంగారు పడ్డ పెళ్లికొడుకు ఆంజనేయులు కాసేపు దిక్కులు చూసి, మెల్లగా పెళ్లికూతురు చెవిలో "నీవు ఇక్కడికి వస్తున్నట్టు మీ ఇంట్లో వాళ్లకి తెలుసా?'' అన్నాడు గుసగుసగా. 


ఏం మిషన్ సరిపోతుంది?
జిమ్ నేర్పించే యజమానితో "ఒకమ్మాయిని వల్లో వేసే పనిలో ఉన్నాను. నేను క్యూట్‌గా తయారవ్వాలంటే ఏం మిషన్ ఉపయోగించాలో చెబుతారా?'' అన్నాడు సునీల్.
"అలాంటి మిషన్ ఇక్కళ్లేదు. బయటకెళ్లి ఎ.టీ.ఎమ్. మిషన్ ఉపయోగించండి'' చెప్పాడు జిమ్ యజమాని.



ఆఫ్ టికెట్......
కండక్టర్: పన్నెండేళ్ళలోపు వాళ్ళకు ఆఫ్ టికెట్. నీ వయసెంత బాబూ?
బాబు: పదకొండు
కండక్టర్: నీకు పన్నెండేళ్ళెప్పుడొస్తాయి?
బాబు: బస్సు దిగాక!



జుత్తు - తెలివి...
లల్లు: మమ్మీ! నాన్న తలమీద ఎందుకు వెంట్రుకలు లేవు?
తల్లి: మీ నాన్న చాలా తెలివైన వాడు, ఎప్పుడూ ఆలోచిస్తాడు.
లల్లు: మరి నీ తలమీద ఎందుకు అంత జుత్తు ఉంది?
తల్లి: నోరు మూసుకుని టిఫిన్ తిను.
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top