LipStick - ఎలాంటి లిప్‌స్టిక్‌.....



ఎలాంటి లిప్‌స్టిక్‌..?
ఎంతో అందంగా, చక్కగా మేకప్‌ చేసుకున్నా కూడా లిప్‌ స్టిక్‌ దగ్గరికి వచ్చేసరికి ఆ అందానికి ఒక దిష్టి చుక్కలాగా కనబడుతుంది. కొందరి విషయంలో. లిప్‌స్టిక్‌ అనేది అందాన్ని పెంచాలి కానీ, తగ్గించకూడదు. శరీర వర్ణానికి, పెదవుల రంగుకు సరిపోయే లిప్‌స్టిక్‌ను ఎంచుకోవటం ద్వారాస్ర్తీలు మరింత అందంగా కనబడవచ్చు. లిప్‌ స్టిక్‌ను పెదవులకు అప్లై చేసిన తర్వాత అండర్‌ టోన్‌ కలర్‌ ద్వారానే అసలు షేడ్‌ కనబడుతుంది.

ఇది ఖచ్చితంగా తెలుసుకోవాలంటే, మీరు ఒక తెల్లకాగితం మీద చిన్న మరక లాగా లిప్‌ స్టిక్‌ను రాసి టెస్ట్‌ చేయాలి. ఇలా చేసిన తర్వాత ఇన్నర్‌ షేడ్‌ ఎలా కనబడుతుందో పరిశీలించాలి. మమూలుగా చర్మం మీద అప్లై చేస్తే, లిప్‌ స్టిక్‌ ఇన్నర్‌ షేడ్‌ను ఖచ్చితంగా తెలుసుకోవటం చాలా కష్టం.

మీరు ఎంచుకునే లిప్‌ స్టిక్‌ అండర్‌ టోన్‌లు ఇలా వుండవచ్చు...
ఎరుపు లేదా పింక్‌ :

ఈ లిప్‌ స్టిక్‌లు చూసేందుకు కొంత గాఢమైన అనుభూతిని ఇస్తాయి. మీ శరీర ఛాయలో కూడా ఎరుపు రంగు వుంటే ఇది పూర్తిగా మీకు సూట్‌ అవుతుంది. ఒక్క పెదవులు రంగే కాదు, శరీరం రంగును కూడా లిప్‌స్టిక్‌ విషయంలో పరిశీలించాలి. 



పసుపు, ఆరెంజ్‌ :
ఇవి సున్నితమైన ఫీలింగ్‌ను కలగజేస్తాయి. ఇవి ఉపయోగించాలంటే, శరీరం రంగు కూడా ముదురుగా వుండాలి. అంటే తెల్లని తెలుపు, లేదా బాగా ఎరుపు రంగు చర్మం వున్నవారే వీటిని ఉపయోగించాలి.పాలిపోయిన రంగు వున్నవారికి ఈ లిప్‌స్టిక్‌ సరిపడదు. 



నీలం : 
అవతలి వారు మిమ్మల్ని చూడగానే ఆకర్షించేలా చేస్తాయి ఈ రంగులు. అంటే గాఢమైన ప్రభావాన్ని కలిగిస్తాయి. వీటిని రాత్రి పూట వాడటం కంటే పగటి పూట వాడితేనే బాగుంటుంది. ఈ లిప్‌స్టిక్‌లు వాడితే, మీరు ఒక ఫ్లోరో సెంట్‌ లైట్‌ కింద నిలబడి, అది మీ పెదవులపై ప్రతిబింబిస్తుందన్న అనుభూతిని అవతలి వ్యక్తులను కలిగిస్తాయి. కాబట్టి వీటిని అరుదైన సందర్భాల్లో తప్ప రోజువారీ వాడకుండా వుంటేమంచింది.


సిల్వర్‌/బూడిదరంగు :
ఇవి రాత్రి పూట ఎక్కువగా ఉపయోగించేందుకు వీలుగా వుంటాయి. ఎందుకంటే ఇవి పెదవులకు మెరుపును ఇస్తాయి తప్ప గాఢమైన ప్రభావాన్ని కలిగించవు. దీనివల్ల పెదవులు సున్నితమైన మెరుపులు కలిగివుంటాయి. లైట్ల వెలుగు వీటిమీద పడి తగినంతగా మాత్రమే ప్రతిఫలిస్తుంది.

ఆకుపచ్చ : 

దీన్ని ఎక్కువగా వాడకుండా వుంటే మంచిది. ఈ రంగు చూసేందుకు మరీ ప్రత్యేకంగా కనిపిస్తుంది. ఆ సందర్భాన్ని, లైటింగ్‌ను బట్టి మాత్రమే ఈ రంగును అరుదుగా వాడవచ్చు.
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top