Kitchen Tips



  • పింగాణీ కప్పులకు, సాసర్లకు కాఫీ, టీ మరకలు పట్టి వదలనట్లయితే సోడాబైకార్బనేట్‌లో కొద్దిగా నీటిని కలిపి దానితో శుభ్రం చేయాలి. 
  • కిచెన్ ప్లాట్‌ఫాం మీద కాని స్టవ్ మీద కాని జిడ్డు మరకలుంటే ముందుగా కొద్దిగా నీళ్లు చల్లి సోడాబైకార్బనేట్ చల్లాలి. రెండు - మూడు నిమిషాల తర్వాత స్పాంజ్‌తో కాని క్లాత్‌తో కాని తుడవాలి.


  • థర్మాస్ ఫ్లాస్కు లోపల వాసన వస్తుంటే ఒక టేబుల్ స్పూన్ సోడాబైకార్బనేట్ వేసి నిండా నీటిని పోయాలి. రాత్రంతా అలాగే ఉంచి ఉదయాన్నే కడిగితే వాసనపోయి శుభ్రంగా ఉంటుంది. అవసరమనిపిస్తే బ్రష్‌తో రుద్దవచ్చు.


  • కిచెన్‌లో అవెన్, స్టవ్, ప్లాట్‌ఫాం తుడిచే స్పాంజ్‌లు, బ్రష్‌లు కొద్దిరోజులు వాడిన తరవాత వాసన పట్టేస్తుంటాయి. వాటిని నీటిలో ఒక టేబుల్‌స్పూన్ సోడాబైకార్బనేట్, నాలుగు చుక్కల డిష్‌వాష్ లిక్విడ్ కలిపి రాత్రంతా నానబెట్టి శుభ్రం చేయాలి.
  • ఫిజ్‌ను శుభ్రం చేయాలంటే లీటరు నీటిలో కప్పు సోడా బైకార్బనేట్ కలిపి ఆ మిశ్రమంలో స్పాంజ్‌ను ముంచి లోపలి అరలన్నీ తుడవాలి. తరవాత మంచినీటిలో ముంచి పిండేసిన స్పాంజ్‌తో మరొకసారి తుడవాలి.

  • స్టెయిన్‌లెస్ స్టీల్ సింకులో రెండు స్పూన్ల సోడా బైకార్బనేట్ చల్లి కొద్దిగా నీటిని చల్లి రుద్ది కడిగితే కొత్తదానిలా మెరుస్తుంది.
  • వెండి వస్తువులు నల్లబడకుండా ఉండాలంటే వాటిని భద్రపరిచే చోట కర్పూరం బిళ్ళలు ఉంచాలి.


  • వరిపిండి, శనగపిండి లాంటివి కవర్‌లో వేసి ఫ్రిజ్‌లో పెడితే ఎక్కువ కాలం నిల్వ ఉంటాయి.
  • చిటికెడు వంటసోడాను టీ కప్పులలో వేసి నిమిషం తరవాత శుభ్రపరిస్తే లేయర్‌లా ఏర్పడిన టీ మరకలు మటుమాయం అవుతాయి.
  • పిండివంటలు చేసిన తరవాత చుట్టుపక్కల ఏర్పడిన జిడ్డు మరకలు పోవాలంటే- వాటి మీద కొద్దిగా ఏదయినా పొడి పిండి జల్లి పేపర్‌తో తుడిచేస్తే సరి. 
    block1/Bhakti

    buttons=(Accept !) days=(20)

    Our website uses cookies to enhance your experience. Learn More
    Accept !
    To Top