శరీరం తాజాగా ఉండాలంటే...

ఒత్తిడి, మానసికపరమైన భావోద్వేగాలు, శృంగార భావనలు కలిగినప్పుడు దేహంలోని గ్రంధుల నుంచి కొన్ని రకాల స్రవాలు విడుదలవుతాయి. ఇవి చెమటతో కలిసిపోవడంతో చెడు వాసన ప్రారంభమవుతుంది. కిడ్నీవ్యాధులు, ఫంగల్ ఇన్ఫెక్షన్లు, కాలేయ వ్యాధులు, శరీరంలోకి తీసుకునే పలు రకాల మందులు శరీరం నుంచి దుర్వాసనకు వెలువడడానికి కారణమవుతాయి.
శరీరంలో జరిగే పలు రకాల మార్పులు, రసాయనిక ప్రక్రియల కారణంగా దేహం నుంచి చెడు వాసన చెమట రూపంలో వెలువడుతుంది. ఇటువంటి పరిస్థితుల్లో నలుగురిలోకి వెళ్లాలంటే నామోషీగా ఉంటుంది. ఎదుటివారి ముందు చిన్నచూపుకూ లోనవుతాం. సంబంధాలు కూడా దెబ్బతింటాయి. కనుక దేహం నుంచి దుర్వాసన వెలువడకుండా ఉండాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది.


కారణాలు
వేడి వాతావరణం, తీసుకునే ఆహారం తదితర కారణాల వల్ల చెమట అధికంగా పడుతుంది. కిడ్నీవ్యాధులు, ఫంగల్ ఇన్ఫెక్షన్లు, కాలేయ వ్యాధులు, శరీరంలోకి తీసుకునే పలు రకాల మందులు ్ట్రశరీరం నుంచి దుర్వాసనకు వెలువడడానికి కారణమవుతాయి.


మధుమేహ రోగులు తీసుకునే ఇన్సులిన్ కూడా ఇందుకు కారణమవుతుంది. దేహంలో మలినాలు పేరుకుపోవడం, మద్యపానం, సిగరెట్లు, జింక్ విటమిన్ లోపంవల్ల కూడా దుర్వాసన వెలువడుతుంది. ఇవే కాకుండా ఒత్తిడి, మానసికపరమైన భావోద్వేగాలు, శృంగార భావనలు కలిగినప్పుడు దేహంలోని గ్రంధుల నుంచి కొన్ని రకాల స్రవాలు విడుదలవుతాయి.


ఇవి చెమటతో కలిసిపోవడంతో ఈ చెడు వాసన ప్రారంభమవుతుంది. ఉల్లిగడ్డ, వెల్లుల్లి, కొన్నిరకాల చేపలు, లవంగాలు, మసాల దినుసుల వాడకం కూడా దుర్వాసనకు కారణమవుతాయి. స్థూలకాయుల్లో కూడా ఇది ఎక్కువగా కనిపిస్తుంది.


చికిత్స, నివారణ
* సబ్బుతో స్నానం చేయండి.
* కాటన్ వస్త్రాలను ధరించడమే అన్ని విధాలా మంచిది. ముఖ్యంగా లోపలి వస్త్రాలు కాటన్‌వే వాడాలి.


* చెమట పట్టే ప్రాంతాల్లో వెనిగర్ రాసుకోవడం మంచి ఫలితాన్నిస్తుంది. డియోడరెంట్ కన్నా ఇది మేలు. అలాగే చెమట పట్టే ప్రాంతాల్లో బేకింగ్ సోడా కూడా రాసుకోవచ్చు.
* చాలామంది స్నానాన్ని ఏదో ముగించాం అన్నట్లు చేస్తుంటారు. కానీ శరీరంపై పేరుకున్న మలినాలు, బ్యాక్టీరియాపోయే విధంగా స్నానం చేయాలి. లేకుంటే స్నానం చేసిన నిమిషాల్లోనే దుర్వాసన వస్తుంది.


* ఒకసారి ధిరించిన వస్త్రాలనే మళ్లీ మళ్లీ వేసుకోవడం, పరిశుభ్రమైన నీటితో ఉతక్కపోవడం కూడా కారణాలే. శరీరతత్వం, జన్యుసంబంధిత కారణాల వల్ల కూడా ఈ పరిస్థితి ఏర్పడుతుంది.
* శరీరానికి అతుక్కుపోయే వస్త్రాలను వేసుకోకండి. అన్ని ప్రాంతాలకూ గాలి తగిలేలా వస్త్రాలుండాలి.
* ఒకేవేళ మీరేవైనా మందులు వాడుతున్న కారణంగా చెమట అధికంగా పట్టి, దుర్వాసన వస్తుందనుకుంటే డాక్టర్‌ను సంప్రదించండి.
* కాళ్లకు అధికంగా చెమట పట్టేవారు షూ వాడకుండా ఉండడమే మంచిది. సాక్స్‌ను ఒకరోజు కంటే ఎక్కువగా వాడకూడదు. * కాఫీ, టీలను మరీ ఎక్కువగా సేవించకండి.
* స్నానం చివరిలో ఒక మగ్గులో ఒక టేబుల్ స్పూన్ తేనెవేసి ఆ నీళ్లతో శరీరాన్ని తడుపుకోండి.
* లేదా ఒక స్పూన్ పటిక పొడిని నీళ్లలో కలుపుకుని ఆ నీటితో స్నానం చేస్తే తాజా సువాసన ఎక్కువసేపు నిలిచి ఉంటుంది. * లేదా ఒక కప్పు వెనిగర్‌ను నీళ్లలో వేసుకుని ఆ నీళ్లలో స్నానం చేసినా సరిపోతుంది.
* కర్పూర నూనెను కూడా స్నానపు నీటిలో కలుపుకోవచ్చు.
* పుదీనా ఆకులను నీటిలో మరగబెట్టి ఆ నీళ్లను స్నానపు నీటిలో కలుపుకుని స్నానం చేయండి.
* రోజు మొత్తంలో నీటిని ఎక్కువగా తాగండి
* చెమట అధికంగా పట్టేవారు లెసిథిన్, క్లోరిన్, కాంటిన్, లైసిన్ అధికంగా ఉండే సోయా, మొక్కజొన్న, గోధుమ, చాక్లెట్లు, పీనట్స్, నట్స్, గుడ్లు తదితర పదార్థాలను చాలా తక్కువగా తీసుకోవాలి.
* కమల, పైనాపిల్, ఆకుకూరలు, పీచు అధికంగా ఉన్న ఆహార పదార్థాలు ఉపయోకరంగా ఉంటాయి.
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top