బాదంతో భలే అందం...



  •  బాదంలో ఉన్న ఎ, ఇ విటమిన్‌లు చర్మసౌందర్యాన్ని పెంచడమేకాకుండా కమిలినట్లుగా ఉన్న చర్మం తిరిగి కాంతివంతం అయేలా చేస్తాయి. 
  • నాలుగు బాదం పప్పులు రాత్రి పాలలో నానబెట్టి, ఉదయాన్నే పొట్టు తీసి పేస్ట్ చేయాలి. దీంట్లో అర టేబుల్ స్పూన్ తేనె కలిపి ముఖానికి పట్టించి 20 నిమిషాల తరవాత గోరువెచ్చటి నీటితో కడిగేయాలి. 
  •   టేబుల్ స్పూన్ బాదం పొడిలో పచ్చిపాలు, రోజ్ వాటర్ కలిపి పేస్ట్ చేయాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి, ఆరాక గోరువెచ్చటి నీళ్లతో కడిగేయాలి. 
  •   రాత్రి పడుకోబోయే ముందు బాదం నూనె ముఖానికీ ఒంటికీ పట్టించి ఉదయాన్నే గోరువెచ్చటి నీటితో స్నానం చేయాలి. 
  •   టేబుల్ స్పూన్ బాదంనూనెలో అర టేబుల్ స్పూన్ శనగపిండి కలిపిన మిశ్రమాన్ని ముఖానికి పట్టించి, ఆరిన తరువాత చన్నీళ్లతో కడిగేయాలి. ఇలా వారానికి రెండు సార్లు చేస్తే కోమలమైన చర్మం మీ సొంతం.


block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top