పండ్లతో చర్మం మిలమిల....


 టివిలో, పేపర్‌లో వచ్చే ప్రకటలను చూసి వందల రూపాయలు పోసి అనేక రకాల క్రీములు కొంటున్నారు. వాటివల్ల ఎంతవరకు ప్రయోజనం కలుగుతుందనేది మాత్రం ప్రశ్నగానే మిగిలి పోతోంది. అందుేక కృత్రిమంగా తయారు చేసే క్రీములపై ఆధార పడడం అంత మంచిది కాదంటున్నారు సౌందర్య నిపుణులు.సహజసిద్ధంగా తయారయ్యే పండ్లు, నట్స్‌తో కాంతివంతమైన చర్మాన్ని పొందవచ్చు అంటున్నారు వారు.
మనం నిత్యం ఉపయోగించే పండ్లు మనకు ఎంతగానో ఉపయోగపడతాయి. కేవలం శరీరానికి శక్తి నివ్వడమే కాకుండా చర్మానికి మంచి కాంతి తేవడంలో ఇవి ఎంతగానో దోహదపడుతాయి.



నారింజ :
నారింజలో విటమిన్‌ సి ఎక్కువగా ఉంటుంది. ఇది సూర్యుని నుంచి వచ్చే అల్ట్రావయోలెట్‌ కిరణాల ప్రభావం చర్మంపై పడకుండా చేస్తుంది. చర్మం ముడుతలు పడకుండా, టైట్‌గా ఉంచే కొలాజిన్‌ను ఉత్పత్తి చెయ్యడంలో సహా యపడుతుంది. ప్రతిరోజు ఒక నారింజను తినడం మంచిది. రోజుకు రెండు వందల గ్రాముల విటమినసి అవసరమవుతుంది. నారింజ జ్యూస్‌ తాగడం కన్నా పండు రూపంలో తినడమే మంచిది.


బొప్పాయి :
చూడగానే నోరూరించే బొప్పాయి పండులో తక్కువ కేలరీలుంటాయి. విటమిన్‌ సి ఎక్కువగా ఉంటుంది.నిర్జీవమైన చర్మాన్ని కాంతి వంతంగా చేస్తుంది. బొప్పాయి గుజ్జుతో ఫేస్‌ ప్యాక్‌ కూడా వేసుకోవచ్చు. ప్రతిరోజూ ఒక కప్పు బొప్పాయి ముక్కలు తింటే మంచిది.



గోధుమలు :
గోధుమలలో బి గ్రూపుకు చెందిన విటమిన్‌లు సమృద్ధిగా ఉంటాయి. చర్మంలో మరణించిన కణాల స్థాన ంలో కొత్తకణాల పెరుగుదలలో ముఖ్యపాత్ర వహిస్తాయి. స్ట్రెస్‌, ఇన్‌ఫెక్షన్‌ల కారణంగా చర్మం పాడవకుండా కాపాడతాయి.పగిలిన చర్మాన్ని మృదువుగా తయారు చేస్తుంది. వీటిలో ఉండే నియాసిన్‌, చర్మ ణాలు రక్తంలో ఉన్న పోషకాలను గ్రహించేలా చేస్తుంది. గోధుమపిండితో చేసే బిస్కెట్స్‌, బ్రెడ్‌ను ఎక్కువగా తినాలి.

ప్రొద్దుతిరుగుడుపువ్వు గింజలు : తేలికగా, క్రిస్పీగా ఉండే ఈ గింజలలో ఫాటీ యాసిడ్స్‌ ఉంటాయి.ఇవి చర్మం తేమ ను కోల్పోకుండా చేసి కోమలంగా తయారు చేస్తుంది. బ్లాక్‌ెహడ్స్‌ను నిర్మూలిస్తాయి. మచ్చలు కూడా తగ్గుతాయి. వారానికి రెండుసార్లు రెండు టేబుల్‌ స్పూన్‌ల ప్రొద్దుతిరుగుడు గింజలు తీసుకోవాలి. వంటకు కూడా సన్‌ఫ్లవర్‌నూనెను ఉపయోగించడం మంచిది.


గింజధాన్యాలు :
చర్మకణాల పెరుగుదలకు ఉపయోగపడే ప్రోటీన్లు గింజ ధాన్యాలలో అధిక మోతాదులో ఉంటాయి. చుండ్రును నిర్మూలించే బయోటిన్‌ అనే పోషకం వీటిలో ఉంటుంది. బయోటిన్‌ జుట్టు త్వరగా పెరగడానికి తోడ్పడుతుంది. ప్రతిరోజూ క్రమం తప్పకుండా గింజధాన్యాలు తింటే గోళ్లు ఆరోగ్యంగా ఉంటాయి. ధాన్యాలను ఉడకబెట్టి గుగ్గిళ్ళ రూపంలో తీసుకుంటే చాలా మంచిది. దీనివల్ల నెట్‌ కేలరీలు, జింక్‌ అధికశాతం లభిస్తాయి. జింక్‌ దుమ్ము, ధూళి, కాలుష్యం వల్ల కలిగే రాషెస్‌ రాకుండా చేస్తుంది. క్రమం తప్పకుండా గింజధాన్యాలు తినడం వల్ల చర్మం పొడిబారకుండా ఉంటుంది. కలబంద ప్రతిరోజూ కలబంద జ్యూస్‌ తాగడం వల్ల చర్మంపై వచ్చే దురదలు, మొటిమలు, పి గ్మెంటేషన్‌ సమస్యలను తగ్గించుకోవచ్చు. రోజుకు ముఫె్పై మిల్లీ లీటర్ల జ్యూసును తీసుకోవాలి.

 నట్స్‌ : బాదం, కర్జూరాల వంటి డ్రై ఫ్రూట్స్‌లో క్యాలరీలు, జింక్‌ అధిక శాతం ఉం టాయి. జింక్‌ దుమ్ము, ధూళి, కాలుష్యం వల్ల కలిగే రాషెస్‌ రాకుండా చేస్తుంది. రఫ్‌గా ఉండే చర్మాన్ని మృదువుగా చేస్తుంది. క్రమం తప్పకుండా నట్స్‌ తినడం వల్ల చర్మం పొడి బారకుండా ఉంటుంది. జీర్ణప్రక్రియలో కూడా డ్రైఫ్రూట్స్‌ చాలా ఉపయుక్తంగా ఉంటాయి. వీటిలో ఉండే పీచు పదార్థాలతో మలబద్ధకం నివారణ అవుతుంది.
  
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top