శీతాకాలపు సౌందర్యం...

  • చలికాలంలో ఒంటికి పగుళ్ళు వచ్చి, ఇరిటేషన్ కలగడం సహజం. దీన్ని నివారించడానికి సులభమైన చిట్కాలు పాటిస్తే నునుపైన చర్మం సొంతం చేసుకోవ చ్చు...

  • కొబ్బరినూనెను ఒంటికి పట్టించి, గంట తరవాత గోరువెచ్చటి నీళ్ళతో స్నానం చేస్తే చర్మం మృదువుగా ఉంటుంది.

  • టేబుల్ స్పూన్ పచ్చిపాలలో టీ స్పూన్ శనగపిండి కలిపి పేస్ట్ చేయాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి, మెడకి పట్టించి 20 నిమిషాల తరువాత గోరువెచ్చటి నీటితో కడిగేయాలి. ఇలా వారానికి రెండుసార్లు చేస్తే ముఖం పై ఏర్పడ్డ ముడతలు తగ్గి చర్మం నిగారిస్తుంది.

  • రాత్రి పడుకోబోయే ముందు గోరువెచ్చని నీటిలో కాటన్ ముంచి ముఖాన్ని శుభ్రపరిచి, కోల్డ్ క్రీమ్ లేదా మాయిశ్చరైజర్ (బ్రాండెడ్‌వి, ఎక్స్‌పైరీ డేట్ చూసి తీసుకోవాలి) అప్లై చేయాలి. క్రమం తప్పకుండా ఈ విధంగా చేయడం వల్ల చర్మం పొడిబారకుండా ఉంటుంది. 
  •  చలికాలంలో చర్మంలో నూనె ఉత్పత్తి తగ్గిపోతుంది. దాంతో చర్మం పొడిబారి అందవిహీనంగా, ముడతలుగా, పొలుసులుగా కనిపిస్తుంది. కనుక వారానికోసారి ఎక్స్‌ఫొలియేట్ తప్పకుండా చేసుకోవాలి. దీనివల్ల చర్మంలో పేరుకున్న మృతకణాలన్నీ తొలగిపోతాయి.
  • చలికాలం అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. చల్లటి వాతావరణంలో బయట విహరించడానికి ఎంతో మంది ఉత్సాహం చూపిస్తారు. కానీ, వాతావరణంలో ఉండేఅతి చల్లదనం చర్మానికి హానిచేస్తుందని మాత్రం మరువకూడదు. ముఖ్యంగా చలికాలంలో చర్మాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన అవసరం చాలా ఉంది.

  •   ఏ కాలంలోనైనా చర్మం ఆరోగ్యంగా ఉండాలంటే శరీరంలో నీటి పరిమాణం తగినంత తప్పనిసరిగా ఉండాల్సిందే. చర్మకణాలు నిరంతరం వాటిపని అవి చేసుకుపోవాలంటే చర్మానికి నీరు ఎంతో అవసరం. కనుక సాధ్యమైనంత నీరు తాగుతూ ఉండాలి. దీనివల్ల చర్మంలో తేమ నిలకడగా ఉంటుంది. ఎక్కువగా నీరు తాగడం కష్టమనుకుంటే పండ్లరసాలు, హెర్బల్‌టీ కూడా తాగవచ్చు.
  • చర్మతత్వానికి సరిపడే మాయిశ్చరైజింగ్ క్రీమ్‌ను తప్పకుండా వాడాలి. లేకుంటే చల్లదనం కారణంగా చర్మం పొడిబారుతుంది. దాంతో చర్మం సున్నితత్వం దెబ్బతిని కాంతి హీనంగా మారుతుంది. జింక్ ఆక్సైడ్, విటమిన్ ఈ ఉన్న మాయిశ్చరైజింగ్ క్రీమును ఇందుకు ఎంచుకోండి.

  •   ముఖ్యంగా ఈ కాలంలో చర్మంలో నూనె ఉత్పత్తి తగ్గిపోతుంది. దాంతో చర్మం పొడిబారి అందవిహీనంగా, ముడతలుగా, పొలుసులుగా కనిపిస్తుంది. కనుక వారానికోసారి ఎక్స్‌ఫొలియేట్ తప్పకుండా చేసుకోవాలి. దీనివల్ల చర్మంలో పేరుకున్న మృతకణాలన్నీ తొలగిపోతాయి.

  •   సన్‌స్క్రీన్ లోషన్ కేవలం ఎండాకాలం మాత్ర మే వాడేదని చాలా మంది అనుకుంటుంటారు. కానీ, ఆ అభిప్రాయం సరైంది కాదు. ఇది అన్నికాలాల్లోనూ చర్మ పరిరక్షణకు తప్పనిసరిగా వాడుకోవాల్సినది. ఎస్‌పీఎఫ్ 15 ఉన్న సన్‌స్క్రీన్ లోషన్ వాడుకోవడం వల్ల హానికారక సూర్యకిరణాల నుంచి చర్మానికి రక్షణ లభిస్త్తుంది.

  •   ప్రతి ఉదయం గోరువెచ్చని నీటితో స్నానం చేయడం చర్మానికి మంచిది. మరీ చల్లగా, మరీ వెచ్చగా ఉన్న నీరు చర్మానికి హాని చేస్తుంది. తక్కువ సమయంలోనే స్నానాన్ని ముగించాలి. స్నానపు నీటిలో రెండు చుక్కలు బాదం నూనె వేసుకుని స్నానం చేస్తే చర్మం పొడిబారకుండా ఉంటుంది. సబ్బులు కూడా ఏవి పడితే అవి వాడకూడదు. శీతాకాలానికి అనువైనవే ఎంచుకోవాలి. పెసలను పిండి కొట్టించి దాంతో స్నానం చేస్తే చర్మం నిగారింపు సంతరించుకుంటుంది.
  •  ముఖ్యంగా ఈ కాలానికి తగిన విధంగా తీసుకునే ఆహారంలో మార్పులు చేసుకోవాలి. విటమిన్ సి, బి, ఈ, జింక్, మెగ్నీషియం ఉన్న ఆహారాన్ని తీసుకోవడం ద్వారా చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు. ఈ కాలంలో చాలా రకాల పండ్లు మార్కెట్లోకి వస్తాయి. కనుక ఆహారంలో పండ్లను తప్పనిసరిగా ఓ భాగం చేసుకోవాలి.

  •   ముఖ్యంగా పెదాలు ఈ కాలంలో పొడిబారి పగుళ్లివడం జరుగుతుంది. ఈ విషయంలో నిర్లక్ష్యం చేయకుండా ఉదయం, రాత్రి లిప్‌బామ్‌ను పెదాలకు రాసుకోవాలి. లిప్‌బామ్ రాసుకోలేనివారు నెయ్యిని రాసుకోవచ్చు.

  • ఈ కాలంలో చుండ్రు కూడా పెరిగిపోతుంది. కనుక ఎంచుకునే షాంపూ చుండ్రును నివారించడంతోపాటు కేశాలకు పోషణ ఇచ్చేదిగా ఉండాలి.

  •   ఈ కాలంలో పాదాల పగుళ్లు ఎక్కువగా వేధిస్తాయి. ముఖ్యంగా ఇంట్లో ఎక్కువ సమయంపాటు తడిలో పనిచేసే స్త్రీలకు ఈ సమస్య మరీ ఎక్కువ. నాణ్యమైన సాక్స్‌లు, షూ వేసుకోవడం వల్ల పాదాలను పగుళ్ల నుంచి కాపాడుకోవచ్చు. పగుళ్లిచ్చిన వారు పాదాలను రాత్రి నిద్రించడానికి ముందు గోరువెచ్చని నీటిలో ఉప్పు, పసుపు చిటికెడు వేసి నానబెట్టుకోవాలి. తర్వాత పొడి వస్త్రంతో శుభ్రంగా తుడుచుకుని వైట్ పెట్రోలియం జెల్లీని రాసుకుంటే పాదాల పగుళ్లు పోవడమే కాకుండా మృదువుగా ఉంటాయి.

  •   అన్నిటికంటే శారీరక వ్యాయామం ద్వారా చర్మాన్ని మరింత ఆరోగ్యంగా, కాంతివంతంగా ఉంచుకోవచ్చు. వ్యాయామం కారణంగా చర్మంలోని మలినాలు ఎప్పటికప్పుడు బయటకు వెళ్లిపోతాయి. పైగా ఈ కాలంలో వ్యాయామం చేయడం వల్ల శరీరం ఉత్సాహవంతంగా ఉంటుంది.వేసుకునే దుస్తులు కూడా చర్మాన్ని రక్షించేవిగా ఉండాలి. 
  • నాణ్యమైన కాటన్ వస్త్రాలను ధరించడం వల్ల ఉపయోగం ఉంటుంది. ముఖ్యంగా తడి వస్త్రాలను శరీరంపై ఎక్కువసేపు ఉండకుండా చూసుకోవాలి. 


block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top