బిగ్‌ బి మనీ గేమ్‌


కంప్యూటర్‌ జీ లాక్‌ కియా జాయ్‌..మన్‌ మే సంకోచ్‌ హో తో లైఫ్‌లైన్‌ కా ప్రయోగ్‌ ీజీయే.... ఒకప్పుడు ఈ మాటలు భారతదేశాన్నే కాకుండా ప్రపంచవ్యాప్తంగా సుప రిచితమైన మాటలు. ఒకప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఒక ఊపు తీసుకు వచ్చిన మాట లివి. బాలీవుడ్‌ సూపర్‌స్టార్‌ బిగ్‌ బి అమితాబ్‌ బచ్చన్‌ యాంకర్‌గా సోని టెలివిజన్‌ సమర్పించిన కౌన్‌బనేగా కరోడ్‌పతిలోని మాటలివి. ఇప్పుడు తిరిగి ఈ మాటలు మళ్లీ వినే అవకాశాన్ని సోని టెలివిజన్‌ కల్పించనుంది.ఇప్పటివరకు మూడు సెసన్స్‌ పూర్తి అయిన ఈ కార్యక్రమం నాల్గవ సెసన్‌ ప్రారంభమైంది.
గత సెసన్‌కు కింగ్‌ ఖాన్‌ షారూఖ్‌ హోస్ట్‌గా వ్యవహరించగా తొలి రెండు సెసన్స్‌కు బిగ్‌బి హోస్ట్‌గా ఉన్న విషయం తెలిసిందే. ఇప్పుడు తిరిగి ప్రారంభమవుతున్న నాల్గవ సెసన్‌కు కూడా బిగ్‌బినే హోస్ట్‌గా ఉంటున్నారు. అక్టోబర్‌ 11న ఆయన 68వ పుట్టిన రోజు సందర్భం గా ఈ కార్యక్రమం అట్టహాసంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమం కోసం ఒక ప్రత్యే క పాటను విశాల్‌-శేఖర్‌లు రూపొందించారు. దీన్ని 80 మంది డాన్సర్లపై చిత్రీకరిం చారు.అయితే గతంతో పోల్చితే ఈ షోలో ఒక మార్పు చేశారు. గతంలో కోటి రూపాయలున్న ప్రైజ్‌మనీని 5 కోట్లకు పెంచడంతో పాటు, ప్రశ్నలను కూడా కుదిం చారు. సమాధానాలకు ఇచ్చే సమయంలో మార్పు తీసుకువచ్చారు. గతంలో పోల్చి తే షోలో అనేక మార్పులుంటాయని సోని టెలివిజన్‌ తెలిపింది. గతంలో కంటే మరింతగా ప్రేక్షకులకు చేరువయ్యే రీతిలో ఈ షో ఉంటుందని వారు తెలిపారు. బిగ్‌ బి వెండి తెరపైనే కాదు బుల్లి తెరపై కూడా తన ప్రతిభను నిరూపించుకున్నారు. ఈ షోకు హోస్ట్‌గా అమితాబ్‌ను తప్ప మరెవరినీ ఊహించలేని విధంగా ఆయన దానిని నిర్వహించడమే అందుకు సాక్ష్యం.
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top