Yoga Asanas


 వజ్రాసనం: 

వజ్రాసనం చేయు పద్ధతి: తొలుత సుఖాసన స్థితిని పొందాలినిటారుగా కూర్చోవాలి.రెండు కాళ్లను ముందుకు చాపుకోవాలి.ఒకదాని తరువాత మరొకటిగా కాళ్లను లోపలికి లాక్కోవాలి.వాటిని ఆసనానికి ఇరువైపులా చేర్చాలి.పాదం కింది భాగం(అరికాలు) పైకి కనపడేలా ఉంచుకోవాలి.మోకాలు నుంచి పాదం పైభాగం వరకు మొత్తం నేలను తాకేలా చూసుకోవాలి.పైకి కనపడేలా పెట్టుకున్న పాదం కింది భాగంపై ఆసనాన్ని ఉంచాలి.వెనుకభాగం వైపున్న రెండు కాలి వేళ్ల మొనలు సరిసమానంగా ఉండాలి.అలాగే రెండు మోకాళ్లు ఒకదానికొకటి దగ్గరగా తీసుకురావాలి.రెండు అరచేతులను మోకాళ్లపై ఉంచాలి.తలపైకెత్తి సూటిగా ముందుకు చూడాలి.వజ్రాసనంలో ఉన్నంతసేపూ నిటారుగా ఉండాలి.

త్రికోణాసనం:
గాలి వదులుతూ ఎడమవైపుకు వంగి, ఎడమ అరచేతిని ఎడమ పాదానికి వెనుకగా నేలపై ఉంచాలి. ఈ స్థితిలో ఎడమచేయి, తమ ఛాతీ, కుడి చేయి ఒకే రేఖలో భూమికి సమాంతరంగా ఉంచాలి. నెమ్మదిగా మీ దృష్టిని కుడిచేతివైపు ప్రస్తుతమున్న స్థితిలోనే అరనిమిషంనుండి ఒక నిమిషంవరకు దీర్ఘశ్వాసక్రియతో ఉండాలి. తర్వాత యధాస్థితికి చేరుకోవాలి. ఇదే రకంగా సమస్థితిలోకి వచ్చి కుడివైపు కూడా చేయాలి.

కటిచాక్రాసనం :
చదునైన నేలపై నిటారుగా నిలబడాలి. తల వెనుకభాగం సమాంతరంగా ఉండేలా చూడాలి. చూపు ఎదురుగా ఉండాలి.చేతులను ముందుకు చాపాలి. అలాగే కాళ్ళ మధ్య కనీసం అరమీటరు దూరం ఉండేలా చూడాలి. ఎడమ చేతిని కుడి భుజంపైకి తీసుకురావాలి. కుడిభుజాన్ని వెనుకకు మడవాలి.అలాగే కుడిచేతిని ఎడమ భుజంపైకి తీసుకువస్తూ ఎడమ భుజాన్ని వెనుకకు మడవాలి. కుడి భుజంపై నుంచి వీలైనంత వరకు చూడాలి. ఈ స్థితిలో కొన్ని సెకనులు నిలబడాలి. ఇలాగే కొద్దసేపు నిలబడిన తరువాత పూర్వస్థితికి రావాలి. ఇదే విధంగా రెండోవైపు చేయాలి. ఇలా కనీసం 5 మార్లు చేయాలి.
         అదనపు కొవ్వు తగ్గుతుంది.   

పాద హస్తాసనం  : 
మొదటగా చదునైన నెలపై నిటారుగా నిలబడాలి. ఈ స్థితిలో కాళ్ళు ఒకదానికొకటి చాలా దగ్గరగా ఉండాలి. మెల్లగా గాలి పీల్చుకుంటూ తేతులను పైకి ఎత్తాలి. భుజాలు చెవులను తాకుతూ ఉండేలా చూసుకోవాలి. గాలి వదులుతూ ముందుకు వంగాలి. ఈ ఆసనంలో సడుగుల నుంచి పాదాల వరకు నిటారుగా చక్కగా ఉండాలి. ఇదే సమయంలో చేతులు పాదాలను తాకుతూ ఉండాలి. తలను మోకాళ్ళుకు సాధ్యమైనంత దగ్గరగా తీసుకురావాలి. ఇదే స్థితిలో 30 నుంచి 40 సెకనులు ఆగాలి. ఇది సూర్య నమస్కారంలోని 3వ దశను తలపిస్తుంది. మెల్లగా గాలి పీల్చుతూ ఈ స్థితి నుంచి బయటకు రావాలి. మెల్లగా చేతులు, తలభాగాన్ని తిరిగి వెనక్కు తీసుకురావాలి. 
                 జీర్ణశక్తి బాగుంటుంది.

అర్ద చంద్రాసనం :
చదునైన నేలపై నిలబడాలి. మొదట పాదాలను దగ్గరకు చేర్చాలి. పాదాలు ఒకదానికొకటి ఆనుకుని ఉండేలా చూడాలి.(సౌధాన్లో నిలబడడం) రెండు కాళ్ళను ఒకదానికొకటి దూరం జరపాలి. అంటే విశ్రామ్‌లో నిలబడడమన్న మాట. కుడి చేయిని భూమికి సమాంతరంగా పక్కకు చాచాలి. అరచేయి ఆకాశానికి అభిముఖంగా ఉండేలా తిప్పాలి. అలాగే చేయిని నిటారుగా ఉంచుతూనే పైకి లేపాలి. భుజాలు తలను తాకుతూ చేయి ఆకాశాన్ని చూపుతున్నట్లు ఉండాలి. అలాగే మెల్లగా నడుము నుంచి తలవరకు ఎడమవైపుకు వంచాలి. అలాగే చెయ్యిని కూడా శరీరంతోపాటు వంచాలి. ప్రస్తుతం అర్ధచంద్రాకారం ఏర్పడుతుంది. తిరిగి ఆసనం వేసిన రీతిలోనే మెల్లగా మొదటి స్థానానికి రావాలి.
           శరీరం సమతుల్యం గా ఉంటుంది .   


block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top