Pimples

మొటిమలు

 * పుదీనా ఆకు రసం లేదా తులసి ఆకుల రసంలో ఉప్పు కలిపి మొటిమలమీద ప్రయోగించి గంట తరువాత సున్నిపిండితో, గోరువెచ్చని నీళ్లతో కడిగేయాలి.
* ముళ్ళ గోరింట ఆకును నూరి కొబ్బరినూనెతో కలిపి మొటిమలమీద ప్రయో గించాలి.
* పసుపు కొమ్మును, శొంఠి కొమ్మునూ కలిపి మెత్తగా నూరి ముఖానికి లేపనం చేసుకొని గంట తరువాత
గోరువెచ్చని నీళ్లతో కడిగేసుకోవాలి.
* వెల్లుల్లిపాయల రసాన్ని మొటిమలమీద లేపనం చేసుకోవాలి.
* పసుపు, చిరుశనగలు, నువ్వుల నూనె, ఉప్పు... వీటిని మెత్తగా నూరి ముఖం మీద లేపనం మాదిరిగా ప్రయోగించాలి.
* కుంకుమ పువ్వు, రేలచిగుళ్లు సమభాగాలుగా తీసుకొని మెత్తగా నూరి లేపనం చేయాలి.
* మంచి గంధంతో హారతి కర్పూరాన్ని కలిపి మొటిమలమీద ప్రయోగించాలి.

మచ్చల నివారణ కోసం...
టీ స్పూన్ ఆలివ్ ఆయిల్‌లో అదే మోతాదులో సాండిల్ ఆయిల్ కలపాలి. ఈ మిశ్రమాన్ని పడుకోబోయే ముందు ముఖానికి పట్టించి వేళ్లతో వలయాకారంలో సుతిమెత్తగా అయిదు నిమిషాల పాటు మసాజ్ చేయాలి. మరుసటి ఉదయం గోరువెచ్చటి నీటితో కడిగేయాలి. 15 రోజులపాటు ఈ విధంగా క్రమం తప్పకుండా చేయడం వల్ల మొటిమల తాలూకు మచ్చలు మటుమాయమవుతాయి.


మొటిమల నివారణ కోసం
  • చిన్న పాత్రలో రెండు టేబుల్ స్పూన్ల ముల్తానా మట్టిలో అంతే మోతాదులో గంధం పొడి, రెండు చుక్కల అల్లం రసం, కోడిగుడ్డులోని తెల్ల సొన, టీ స్పూన్ రోజ్‌వాటర్ బాగా కలిపి పేస్ట్ చేయాలి. ఈ మిశ్రమాన్ని బ్రష్ సహాయంతో ముఖానికి పట్టించి 20 నిమిషాల తరవాత గోరువెచ్చటి నీటితో కడిగేయాలి.

  • కొన్ని తులసి ఆకులు అంతే పరిమాణంలో పుదీనా ఆకులు తీసుకుని కొన్ని చుక్కల నీటిని జత చేసి పేస్ట్ చేయాలి. ఈ మిశ్రమాన్ని ముఖం మీద అప్లై చేసి 30 నిమిషాల తరవాత గోరువెచ్చటి నీటితో కడిగేయాలి.

  • రెండు టీ స్పూన్ల పసుపులో టీ స్పూన్ రోజ్‌వాటర్ కలిపి పేస్ట్ చేసి, ముఖంపై అప్లై చేసి ఆరిన తరవాత చ న్నీటితో కడిగేయాలి.

ఈ ప్యాక్‌లు వారంలో ఒకసారి క్రమం తప్పకుండా రెండు నెలలపాటు చేస్తే మొటిమలు తగ్గి ముఖం కాంతివంతం అవుతుంది.
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top