Pav Bhaji




కావలసినవి పదార్దాలు  :
బంగాళాదుంపలు - 4
టమాటాలు - 4
ఉల్లిపాయలు - 2
పచ్చ బఠానీ - 1/4కప్పు
కాలీఫ్లవర్ - చిన్న ముక్క
పచ్చిమిర్చి - 3
కొత్తిమీర - ఒక కట్ట
అల్లం - చిన్న ముక్క

వెల్లుల్లి - 6 రెబ్బలు
కాప్సికం - 1
నిమ్మకాయ 1
ఉప్పు - తగినంత
బటర్ - 3స్పూనులు
బావ్ బాజీ మసాలా - రెండు స్పూనులు
పావ్ (బన్)

నూనె
 తయారి విధానం  :
ముందుగా బంగాళాదుంపలను, ఉడికించి,తొక్కతీసి, చిన్నగా చితకకొట్టి పక్కన వుంచాలి. టమాటాలను సన్నగా తరిగి వుంచాలి. పచ్చిబఠానీని కొంచెం నీళ్లలో వేసి మెత్తగా ఉడికించి పక్కన వుంచాలి. కాలీఫ్లవర్‌ను పువ్వుల కింద విడదీసి, కాడలు కట్‌చేసి వుంచాలి. కాప్సికమ్‌ను కూడా ముక్కలు చేసి వుంచాలి. పచ్చిమిర్చి ముక్కలు, కొత్తిమీర, అల్లం, వెల్లుల్లి, కలిపి గ్రైండ్ చేయాలి. పాన్‌లో కాస్త నూనె వేసి సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలను వేసి, దోరగా వేయించాలి. దానికి పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్‌ను జతచేసి మరికాస్సేపు కలియపెట్టాలి. ఆపై టమాటా ముక్కలు జోడించి, రెండు మూడు నిమషాలు ఉడకనివ్వాలి. అవసరమైతే రెండు స్పూన్ల నీళ్లు చిలకరించవచ్చు. ఇప్పుడు కాప్సికమ్, కాలీఫ్లవర్, పచ్చిబఠానీ, బంగాళాదుంపల ముక్కలు జోడించి, అరకప్పు నీళ్లు వేసి సన్నటి సెగపై పదినిమిషాల పాటు ఉడకనివ్వాలి. ఆపై చిన్న గరిటె లేదా పెద్ద స్పూను వెనుకకు తిప్పి, దాని సాయంతో కూరగాయముక్కలన్నీ చితికేలా చేయాలి. తగినంత ఉప్పు, పావ్‌బాజీ మసాలా జోడించి, మూతపెట్టి, సన్నటి సెగపై మరికాస్సేపు ఉడికించాలి. కొద్దిగా బటర్ వేసి దింపి పక్కన వుంచాలి. పెనంపై కాస్త బటర్, చిటికెడు ఉప్పుకలిపిన కారం వేసి, పావ్‌బన్‌ను మధ్యకు కోసి, కాల్చాలి. ముందుగా తయారైన కూరపై కాస్త కొత్తిమీర జల్లి, నిమ్మకాయ రసం పిండి, పావ్‌బన్‌తో జోడించి వడ్డించాలి.
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top