Paneer Curry



కావలసిన పదార్దాలు  :
పాలు    2 లీటర్లు
పెరుగు   2 కప్పులు
పన్నీర్ గ్రేవీ కి కావలసినవి    :
టొమాటోలు   1 /2 కిలో
ఉల్లిపాయలు   4
అల్లం    1 అంగుళం
పచ్చిమిర్చి    4
కారం    1 చెంచా
ధనియాలపొడి   2 చెంచాలు
ఉప్పు, పసుపు, నూనె    సరిపడా
తయారి విదానం   :
       ఒక గిన్నెలో పాలను మరిగించి దాంట్లో పెరుగును వేసి సన్నని మంట మీద ఉంచాలి. పాలు విరిగిన తర్వాత దించి పలుచని  గుడ్డలో పోసి మూటగట్టి వ్రేలాడదీసి నీరు పోయిన తర్వాత ఆ మూటను ఒక పళ్ళెంలో పెట్టి దాని మీద బరువైనది పెట్టి ఒక గంట తర్వాత తీసి కావలసిన ఆకారంలో ముక్కలు చేసుకుని ఉంచుకోవాలి. బాండిలో రెండు గరిటల నూనె వేసి కాగిన తర్వాత అల్లం ముక్కలు వేపి ఆ తర్వాత ఉల్లిముక్కలు వేసి గోధుమ రంగు వచ్చే వరకు వేపి మసాలా పొడులను,కారం, ఉప్పు వేసి వేపి ఆ తర్వాత టొమాటో, మిర్చి ముక్కలు వేసి కొంచెం నీరు పోసి ఉడికించాలి. కొంచెం కర్రీ దగ్గరగా వచ్చిన తర్వాత పన్నీరు ముక్కలను వేసి 10 నిమిషాలు మరగనిచ్చి కొత్తిమీర చల్లి స్టవ్ మీద నుంచి దించి సర్వ్ చేయాలి.   
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top