MealMaker Manchuria



కావలసిన పదార్థాలు  
మీల్‌మేకర్ - 200గ్రా
ఉల్లిపాయలు -100గ్రా
క్యారెట్-100గ్రా
బఠాణిలు- 100గ్రా
అల్లంవెల్లుల్లి-100గ్రా
కొత్తిమీర - ఒక కట్ట
పచ్చి మిరపకాయలు -పది
కార్న్ ఫ్లోర్ పౌడర్ -రెండు స్పూన్‌లు
 అజినోమోటో-ఒక స్పూన్
సోయాసాస్-నాలుగు స్పూన్‌లు
వెనిగర్-నాలుగు స్పూన్‌లు
నూనె - సరిపడా
ఉప్పు - రుచికి తగినంత
మైదా - రెండు స్పూన్‌లు
రెడ్ కలర్ - ఒకస్పూన్.
తయారుచేయు విధానం  
ముందుగా మీల్‌మేకర్‌ను నీటిలో నానబెట్టుకుని పదినిమిషాల పాటు ఉడికించుకోవాలి. అల్లంవెల్లుల్లి, పచ్చి మిర్చి, క్యారెట్, బఠాణిలను కొద్దిగా ఉడికించుకోవాలి. అందులో మైదా, కార్న్‌ఫ్లోర్ పౌడర్, సోయాసాస్, అజినోమోటో, ఉప్పు, కలర్ వేసుకోవాలి. వెనిగర్‌ను కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి. ఇప్పుడు ఒక పాత్రలో నూనె వేసి కాస్త వేడి అయ్యాక ఈ ఉండలను వేసి వేయించుకోవాలి.

మరొక పాత్రలో నూనె వేసి సన్నగా తరిగిన ఉల్లిపాయలు, వెల్లుల్లి వేసి వేగిన తరువాత వేయించుకున్న మంచూరియాను వేసుకోవాలి. కాసేపు ఫ్రై చేసుకుని కొత్తిమీర వేసుకుని దింపుకోవాలి. అంతే.. మీల్‌మేకర్ మంచూరియా రెడీ.
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top