Face - Beauty Tips


  • నిమ్మరసంలో రాళ్ళ ఉప్పు  కలిపి దాంతో ఫేస్  రుద్దుకుంటే చర్మం కాంతివంతంగా మెరుస్తుంది.
  • శనగపిండి ఒక స్పూన్, కొంచెం పసుపు, కర్పూరం,  ఉప్పు, 2-౩చుక్కల కొబ్బరినూనె లేదంటే నువ్వుల నూనె కలిపి ఫేస్ ప్యాక్ లా  వేసుకుంటే  చర్మం లోని జిడ్డు అంతా మటుమాయం. 
  • ఫేస్ మీద ముడుతలు తగ్గాలంటే ఒక స్పూన్ పెరుగు, ఒక స్పూన్ తేనే, ఒక స్పూన్ కోడి గుడ్డు లోని  తెల్ల సోన వేసి కలిపి ఫేస్ కి పట్టించి ఆరనించి కడగాలి. 
  • ఫేస్ మీద సన్నని నూనుగు వెంట్రుకల్ని తొలగించటానికి బాదంపప్పులు, శనగపిండి, ఒక స్పూన్ పాలు, తాజా నిమ్మరసం కొన్ని చుక్కలు వేసి నూరి మసాజ్ చేయాలి. 
  • ఫేస్ మంచి చాయ తో మరిసిపోవాలంటే  5 స్పూన్ ల ఆరంజ్ రసం, ఒక స్పూన్ మీగడ, ఒక స్పూన్ నిమ్మరసం, కలిపి మసాజ్ చేసుకోవాలి. 
  • ఫేస్ మీద ఒక మొటిమ కుడా రాకుండా ఉండి, చక్కని ఒంటి చాయ రావాలంటే 8 -10 తులసి ఆకుల్ని మెత్తగా నలిపి నిమ్మరసంలో  వేసుకుని ప్రతి రోజు మొహానికి పట్టించుకుని ఆరిన తరవాత కాసేపటికి గోరువెచ్చని నీటితో శుభ్రంగా కడుక్కోవాలి. 
  • ఫేస్ మీద ముడుతలు పోవాలంటే తురిమిన కారోట్, ఒక స్పూన్ పాలు వేసి మెత్తగా నూరి దాన్ని ఫేస్ ప్యాక్ ల పట్టించుకోవాలి. 
  • మొటిమలు, బ్లాకు హెడ్స్ పోవాలంటే కాకరకాయ తొక్కుతో ఫేస్ మీద రుద్దాలి. 
  • మొటిమల మచ్చలతో మీరు బాదపడుతోంటే ముల్లంగి రసం, అంతె పరిమాణంతో పెరుగు  కలిపి ఫేస్ కి రాసుకుని గంట పోయిన తరువాత కడిగేసుకోవాలి. 
  • ఫేస్ జిడ్డుగా ఉంటె రాత్రిళ్ళు గులాబీ ఆకులను నీళ్ళలో వేసి ఉదయం ఆ నీళ్ళతో ఫేస్ కడుక్కుంటే తేటగా ఉంటుంది. 
  • ఫేస్ మీద మచ్చలు, మొటిమలు పోవాలంటే పరగడుపున నిమ్మరసం  కలిపిన కొబ్బరి నీళ్లు తాగాలి.
  •   సుగంధ పాలవాయువితంగాలు, గంధకచ్చురాలు, వట్టివేర్లు, కస్తూరి, పసుపు, ఎండిన వేప, తులసి, మారేడు ఆకులు, నిమ్మకాయతోలు ఎండినవి,  మంజిష్టా అన్నింటినీ సమభాగాలుగా ఎండబెట్టి చూర్ణించి కలిపి ఉంచుకోవాలి. ఈ చూర్ణాన్ని పొట్టు ఉన్న పెసర్లు దోరగా వేయించి పొడి చేసుకుని   అందులో చూర్ణాన్ని  కలుపుకుని ప్రతి రోజూ శరీరానికి నూనె రాసుకుని ఈ పిండితో నలుగు పెట్టుకుంటే శరీరంపై పేరుకున్న కొవ్వు కరిగిపోయి చర్మం అందంగా మెరుస్తుంది. చర్మవ్యాధులు రావు.
  • టేబుల్ స్పూన్ అరటిపండు గుజ్జులో అర టేబుల్ స్పూన్ టొమాటో రసం కలిపి పేస్ట్ చేయాలి. ఈ మిశ్రమాన్ని మెడకు, ముఖానికి చేతులకి పట్టించి 20 నిమిషాల తరవాత వేడినీటితో కడిగేయాలి. పార్టీకి వెళ్లే గంట ముందు ఈ ప్యాక్ వేసుకుంటే చర్మం తాజాగా కాంతివంతంగా ఉంటుంది.
  • టొమాటో రసంలో కొన్ని పాల చుక్కలు కలిపిన మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసి 15 నిమిషాల తరవాత కడిగేయాలి. క్రమం తప్పకుండా 15 రోజుల పాటు ఈ విధంగా చేస్తే చర్మం నిగారిస్తుంది.
  • డ్రై స్కిన్‌వారి కోసం...
    విటమిన్’ఇ’ఆయిల్‌లో మూడు చుక్కల నిమ్మరసం, అర టీ స్పూన్ గ్లిజరిన్ కలిపిన మిశ్రమాన్ని ముఖానికి పట్టించి 20 నిమిషాల తరవాత కడిగేయాలి.
  • టీ స్పూన్ ఆలివ్ ఆయిల్‌లో, కొద్దిగా శనగపిండి, పాలమీగడ, కొన్ని చుక్కల తేనె రంగరించాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి, మెడకు పట్టించి 20 నిమిషాల తరవాత కడిగేయాలి.

  • టేబుల్ స్పూన్ నారింజ రసంలో పసుపు, కొద్దిగా గంధం పొడి కలిపి పేస్ట్ చేయాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి, మెడకు పట్టించి 20 నిమిషాల తరవాత కడిగేయాలి.

  • టీ స్పూన్ బాదం నూనెలో కొన్ని చుక్కల తేనె కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి 20 నిమిషాల తరవాత కడిగేయాలి. ఇలా క్రమం తప్పకుండా వరసగా ఏడురోజులపాటు చేస్తే చర్మం కాంతివంతమవుతుంది.


      block1/Bhakti

      buttons=(Accept !) days=(20)

      Our website uses cookies to enhance your experience. Learn More
      Accept !
      To Top