Cooking Tips

  • ఆకుకూరలను ఒకటి రెండు రోజులు కంటే ఎక్కువగా నిల్వ ఉంచకండి.
  • తరగడానికి ఉపయోగించే ముందు కత్తిని చిన్న మంట మీద వేడి చేయండి. దాని పదును పెరుగుతుంది. 
  • పెరుగు పుల్లబడకుండా ఉండాలంటే అందులో  కొబ్బరి వెయ్యాలి.
  • పులుసు కూరల్లో ఉప్పు ,కారం ఏది ఎక్కువగా ఉంటె ఒక చెంచా పంచదార కలిపితే సరి. 
  • చింతపండు  నీళ్ళలో జిడ్డు చేతులు తేలిగ్గా శుభ్రపడతాయి.
  • దోశలు సరిగా రాకుండా అంటుకుపోతుంటే పెనం మీద కాస్త ఉప్పు చల్లండి.
  • కూర అరటి ముక్కలను వేయించేముందు కాస్త పసుపు కడిగిన నీళ్ళలో ముంచితే నల్ల రంగుకు మారవు.
  • కాకరకాయ చేదు పోవాలంటే ఒక రోజు ముందుగానే వాటిని కోసి గింజలు తీసేసి   మిగిలిన ముక్కలకు ఉప్పు రాసి గిన్నెలో వేసి మూత పెట్టి ఫ్రిజ్ లో ఉంచండి. మరుసటి రోజుకి చేదు ఉండదు.
  • ఇంటిని కడిగే నీళ్ళలో కొద్దిగా ఆవనూనె కలపండి. ఫ్లోర్ తళతళలాడుతుంది.
  • వంటకాల్లోకి, ఉల్లి లేనప్పుడు అల్లం రసంలో ఇంగువ కలిపి వాడితే మంచి రుచి,వాసన వస్తుంది.
  • పెనంపై కొంచెం సేపు ఉప్పుని  వేడిచేసి, తరువాత నూనెవేసి దోసెలాంటివి చేస్తే నాన్‌స్టిక్‌ పాన్‌లా పనిచేస్తుంది.
  • మూత తెరిచిన కొత్త కెచప్‌ సీసా వంచినా పడనప్పుడు అందులో సాప్ట్‌ డ్రింక్‌ తాగడానికి ఉపయోగించే ఓ స్ట్రాని చివరిదాకా గుచ్చితే లోపలికి గాలి వెళ్లి కెచప్‌ వంచగానే బయటకు వస్తుంది.
  • ఫ్రిజ్‌ని డీప్రాస్ట్‌ చేసినప్పుడు కరిగిన నీటిని వడపోసి కారు బేటరీలో డిస్టిల్డ్‌ వాటర్‌ బదులు పోయడానికి ఉపయోగించవచ్చు.
  • చవకరకం బియ్యం లేదా కొత్తరకం బియ్యం వండాల్సినప్పుడు అన్నం రుచిగా ఉండాలంటే ముందర ఆ బియ్యాన్ని నూనె లేకుండా కొద్దిగా వేయించి, కొద్ది నిమిషాలు నీళ్లలో నానబెట్టి వండితే ఆ అన్నం రుచిగా ఉంటుంది.
  • అన్నం వార్చిన నీటిలో చాలా శక్తి ఉంటుంది. అందుకని దాన్ని పారబోయకుండా నిమ్మకాయ రసం, చక్కెర కలిపి తాగితే నీరసం తగ్గుతుంది.
  • కందిపప్పు, పెసరపప్పు, శనగపప్పు, మిన పప్పులకి ఆముదం నూనెని కొద్దిగా కలిపి గాలి జొరబడని కంటైనర్స్‌లో ఉంచితే పురుగు పట్టకుండా ఉంటాయి. ఆ డబ్బాలలో వేపాకు వేసినా కూడా పురుగు పట్టకుండా ఉంటాయి.
  • కొవ్వొత్తులు వంక రపోతే పాలిథిన్‌ బేగ్‌లో వాటిని చుట్టి, వేడినీళ్లలో కాసేపు ఉంచి, ఈ తర్వాత ఆ కేండిల్స్‌ని బల్లమీదో, కిచెన్‌ ప్లాట్‌ఫారం మీదో ఉంచి దొర్లిస్తే మృదువుగా అయి కొవ్వొత్తులు మళ్లీ సరిగ్గా అవుతాయి. తర్వాత వాటిని సంచిలోంచి తీసి గట్టిపడనిస్తే సాధారణ స్థితికి వస్తాయి.
  • బజార్లో అమ్మే బ్రెడ్‌కి చుట్టే కాగితానికి నూనె అంటదు కాబట్టి దోసెలు, గారెలు లాంటివి వాటిలో ప్యాక్‌చేస్తే నూనె బయటకి రాదు. పిల్లలకిచ్చే టిఫిన్‌ బాక్సుల్లో ఈ కాగితం ఉంచి పైన టిఫిన్స్‌ ఉంచినా నూనె పెట్టెకి అంటుకు పోదు. తర్వాత కడగడం తేలికవ్ఞతుంది.
  • పార్శిల్‌కి పురికొస కట్టేముందు దాన్ని వేడినీళ్లలో ముంచి తర్వాత కడితే నీరు ఆరిపోగానే తాడు షింక్‌ అయి గట్టిగా ఉంటుంది.
  • రసం పిండిన నిమ్మచెక్కలను చిన్న, చిన్న ముక్కలుగా కోసి కేరట్లు, బఠాణీలు, కేబేజీ, ముల్లంగి వంటి కూరగాయలను ఉడకబెట్టేటప్పుడు నీళ్లల్లో వేసి ఉడికిస్తే వాటి పచ్చి వాసన పోయి రుచి బాగుంటుంది.
  • వెల్లుల్లి రేకల పొట్టు త్వరగా రావాలంటే కొద్దిగా వేడి చేసి ఒలిస్తే సరిపోతుంది.
  • పురుగు పట్టకుండా ఉండాలంటే బియ్యం డబ్బాలో వెల్లుల్లి రెబ్బలు లేదా లవంగాలు వేయాలి.
  • పులిహోర మరింత రుచిగా ఉండలంటే చింతపండు పులుసులో పావు టీ స్పూన్ బెల్లం వేసి మరిగించాలి.
  • దోశలు కరకరలాడుతూ రుచిగా ఉండాలంటే కొన్ని మెంతులు జత చేసి గ్రైండ్ చేయాలి.
  • ఉడికే అన్నంలో కొన్ని చుక్కల నిమ్మ రసం వేస్తే అన్నం తేటగా, రుచిగా ఉంటుంది.
  • ఉల్లిపాయల్ని న్యూస్ పేపర్‌లో చుట్టి చీకటి ప్రదేశంలో నిల్వ ఉంచితే తాజాగా ఉంటాయి.
  • ఉల్లిపాయలు పొట్టు తీసి, సగానికి కట్ చేసి నీటిలో 10 నిమిషాలు నానబెట్టిన తరవాత కట్ చేస్తే కన్నీరు రాదు.

  • కూరగాయలు ఉడకబెట్టిన నీటిని పారబోయకుండా, కూర గ్రేవీలోకి ఉపయోగిస్తే రుచిగా ఉంటుంది.
  • పచ్చిమిర్చిముద్ద, అల్లం వెల్లుల్లి ముద్ద చేసిన తరవాత టీ స్పూన్ వేడి నూనె కలిపి నిల్వ చేస్తే ఎక్కువకాలం నిల్వ ఉంటుంది.
  • టీ స్పూన్ ఉప్పులో పావు టీ స్పూన్ పసుపు కలిపిన మిశ్రమాన్ని గది మూలల్లో చీమలు వచ్చే స్థలంలో చల్లితే చీమల బెడద తగ్గుతుంది.


  • చిన్న చిన్న ఇంగువ ముక్కలు కిచెన్ మూలల్లో, షెల్ఫుల్లో ఉంచితే బొద్దింకలు, క్రిములు దరిదాపుల్లోకి రావు.


  • గ్లాస్ నీటిలో పచ్చ కర్పూరం వేసి, బెడ్ రూమ్ మూలలో ఉంచితే దోమలు దరి చేరవు.
  • పాలమీద మీగడ మరింత ఎక్కువగా రావాలంటే పాల గిన్నె మీద మందపాటి ముస్లిన్‌ క్లాత్‌ కప్పి ఫ్రిజ్‌లో రాత్రంతా ఉంచితే అనుకున్న ఫలితాన్ని పొందవచ్చు.


  • నాన్‌స్టిక్‌ పాన్‌ మీద జిడ్డు త్వరగా వదలాలంటే ఈ విధంగా చేసి చూడాలి.


  • కొద్దిగా వేడి నీటిని పాన్‌మీద పోసి ఆతరువాత సబ్బు లేదా సర్ఫ్‌తో శుభ్రం చేసుకోవాలి.

  • మిక్సీ జార్‌లో కొద్దిగా రాళ్ళ ఉప్పు వేసి వాటిని కొద్దిసేపుతిప్పితే వాటి బ్లేడ్లు మరింత పదునెక్కుతాయి. 
  • కట్ చేసిన ఆపిల్ ముక్కలకు కొద్దిగా నిమ్మరసం రుద్ది కాసేపు నిల్వ చేసినా నల్లబడవు.
  •   పిండి వంటలు కరకరలాడాలంటే మరిగేనీటిలో బియ్యం పిండి వేసి తడిపితే సరి.
  •  చోరీలు, సమోసాలు క్రిస్పీగా రావాలంటే పిండిలో వేడి నూనె పోసి కలపాలి.
  • పూరీల పిండి లో అరటిపండు గుజ్జు వేస్తే పూరీలు మెత్తగా వస్తాయి.
  • అరటికాయలను కట్ చేసేటప్పుడు చేతులకు, చాకుకు కొంచెం నూనె రాస్తే జిగురు అంటదు.
  • కొబ్బరి చిప్పను పావుగంట సేపు నీటిలో నానబెట్టాలి. ఇలా చేస్తే కొబ్బరి ముక్కలు సులువుగా వస్తాయి.
                      block1/Bhakti

                      buttons=(Accept !) days=(20)

                      Our website uses cookies to enhance your experience. Learn More
                      Accept !
                      To Top