Asthma


ఆస్తమా...ఊపిరాడనివ్వని బాధ 
ఆస్తమా అంటే స్వేచ్ఛలేని శ్వాస. ఊపిరితిత్తులు దీర్ఘకాలంగా శ్వాసకోశ సమస్యలను ఎదుర్కొంటుంటే ఆ ఇబ్బందిని ఆస్తమా అంటారు. ఈ వ్యాధిగ్రస్తుల్లో అలర్జిక్ రియాక్షన్ ద్వారా శ్వాసనాళాల్లో అడ్డు ఏర్పడి గాలి పీల్చుకోవడం ఇబ్బంది అవుతుంది. దీంతో పిల్లికూతలు, దగ్గు, ఆయాసం, ఛాతీలో నొప్పి వస్తాయి. వీటికి శ్వాసకోశమార్గంలో వాపు, ఎరుపుదనం, మార్గం కుంచించుకోవడం, బ్రాంకియల్ కండరాల స్పాసమ్ వలన శ్వాసమార్గ ప్రక్రియలో ఇబ్బందులు వంటివి కారణాలు.
ఆస్తమాకు దారితీసే పరిస్థితులు...
చల్లగాలి దుమ్ముధూళి, పొగ(ధూమపానం) అలర్జిన్స్ గడ్డిచెట్లు, ఫంగస్, పొల్యూషన్ ఘాటువాసనలు శారీరక శ్రమ ఎక్కువ కావడం వైరల్ ఇన్‌ఫెక్షన్ పెంపుడు జంతువుల విసర్జక పదార్థాలు
శ్వాసకోశ ఇన్‌ఫెక్షన్స్
రోగనిర్ధారణ... వంశ ఆరోగ్య చరిత్ర, అలర్జీలు, ఎగ్జిమా, చర్మవ్యాధులు, చిన్నతనంలో శ్వాసకోశ జబ్బులు శారీరక పరీక్షలు, ముక్కు, గొంతు, ఛాతీ పరీక్షలు ఎక్స్- రే కఫం పరీక్ష అలర్జీ చర్మపరీక్షలు, అలర్జెన్స్ ఇచ్చి రియాక్షన్‌ని చూడడం స్ఫైరోమెట్రీ(మీటర్ ద్వారా శ్వాసపరీక్ష) గుండె, ఊపిరితిత్తులకు ఇతర సమస్యలు, రక్తలోపం, కిడ్నీ వ్యాధులు, జీర్ణకోశ వ్యాధులు ఉంటే వాటి నిర్ధారణకు పరీక్షలు చేయాలి.

ఆస్తమాతో జీవితం?
రోజువారీ పనులు చేసుకోవచ్చు రాత్రి, ఉదయం శ్వాస ఇబ్బందిని నివారించడం, తగ్గించడం శారీరక శ్రమ ఎక్కువగా ఉండని ఉపాధిని చూసుకోవడం దుమ్ము, ధూళి, పొగ, చల్లటి వాతావరణానికి దూరంగా ఉండడం ప్లాస్టిక్ బ్యాగ్‌లు, కార్పెట్‌లు, బెడ్‌షీట్లు, బ్లాంకెట్లలో డస్ట్‌మైట్‌లు(చిన్న చిన్న పరాన్న జీవులు) ఉంటాయి. వాటిని వారానికోసారి శుభ్రం చేయడం, ఎండలో వేయడం పెంపుడు జంతువులను దూరంగా ఉంచడం
 

రోగ నివారణ... బ్రాంకోడైలేటర్స్, కార్టికోస్టిరాయిడ్స్, యాంటి బయాటిక్స్, స్ప్రే మందులతో వెంటనే ఉపశమనం ఉంటుంది. అయితే ఇవి వ్యాధిని తిరిగి రాకుండా ఆపలేవు. వీటి వాడకం వల్ల సైడ్‌ఎఫెక్ట్స్ రావచ్చు. ఆస్తమాను యోగా, ధ్యానంతో చాలా వరకు నివారించవచ్చు. ఆస్తమాను హోమియో మందులతో శాశ్వతంగా నివారించవచ్చు. ఆంటిమ్‌టార్ట్, ఆంటిమోనిమ్ ఆర్స్, ఆర్సినిక్ ఆల్బ్, స్పాంజియా, నేట్రంసల్ఫ్, ఆరేలియా, కార్బోవెజ్‌లు ఉపకరిస్తాయి. ఆస్తమాతో బాధపడుతున్న వాళ్లు తమ ఇంటి పరసరాలు వ్యాధి తీవ్రతను పెంచేవిగా ఉంటే వెంటనే ఆ ప్రదేశాలను వదిలి సురక్షితమైన ప్రదేశాలకు మారాలి.
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top