Palak Paneer

కావలసిన పదార్దాలు :
పాలకూర                :       6  కట్టలు
ఉల్లిముక్కలు          :       2 చెంచాలు
జీలకర్ర                   :       1  చెంచా

పచ్చిమిర్చి             :        4
మసూరిపప్పు          :        2  చెంచాలు

ధనియాలపొడి        :        2  చెంచాలు
పన్నీర్                   :        200  గ్రాములు

కారం                     :        ౩  చెంచాలు
పంచదార               :        కొంచెం
ఉల్లిపాయలు           :        ౩
టొమాటో                :        ౩
వెల్లుల్లి                   :        8  రేకలు
చీజ్                       :        2  చెంచాలు
గరంమసాల           :        1  చెంచా
పాలమీగడ             :        1/2  కప్పు
నెయ్యి                    :        ౩     చెంచాలు
తయారి  విధానం  :
              
                పాలకూరను బాగా కడిగి సన్నగా  తరిగి దీనికి మసూరి పప్పును కలిపి కుక్కర్ లో ఉడికించాలి . ౩ నుంచి 4 నిముషాలు ఉడకనించి తీసి చల్లారినాక  నీరును వడపోసి నీరు విడిగా ఉంచి కూరను మిక్సిలో వేసి మెత్తగా చేసుకోవాలి . బాండిలో  1 చెంచా నెయ్యి వేసి వేగిన తర్వాత వెల్లుల్లి ఉల్లిముక్కలు , వేపి దానిలో టమేటా ముక్కలు కుడా వేసి వేగించాలి . తీసి చల్లారిన తరవాత వాటిని  మిక్సీ చేసి ఉంచాలి . 
                    బాండిలో మగ్గిన నెయ్య  వేసి జీలకర్ర వేపాలి . పచ్చిమిర్చ్  ముక్కలు సన్నగా తరిగిన ఉల్లిముక్కలు వేసి వేపాలి . ముక్కలు వేగిన తరవాత ధనియాలపొడి,  ఉప్పు, పసుపు,  పంచదార, కారం, గరంమసాల ,వేసి వేపి దానికి ఆకుకూరముద్ద ,టామాటోముద్ద వడకట్టిన నీరు కుడా పోసి కలిపి సన్నని మంట మీద ఉడికించాలి .దీనికి కట్ చేసిన  పన్నీరు నెయ్యి లో వేపి  కలపాలి . బాగా కలసిన తర్వాత క్రీమ్, తురిమిన చీజ్ వేసి కలిపి దించాలి.


                    చపాతీ లోకి బటర్ నాన్ లోకి ఉల్లిపాయలను చక్రాలుగా తరిగి వాటితో పాటు సర్వ్ చేయాలి . ఉల్లిపాయమీద  మిరియాల పొడి , నిమ్మరసం కలపాలి . పాలక్ పన్నీర్ రెడి .......
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top